Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 19th)..కోపాన్ని తగ్గించుకోవాలి.
ఈ రోజు(2024 June 19th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
తోటివారికి ఇబ్బందిని కలుగజేసే పనులు చేయరాదు. మీమీ రంగాల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త వహించాలి. ధైర్యసాహసాలతో నూతనకార్యాలు మొదలు పెడుతారు.
వృషభం
సన్నిహితులు విందులు, వినోదాలకు ఆహ్వానిస్తారు కానీ మీరు దూరంగా ఉండటం మంచిది. ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళన ఉంటుంది. ఇంటిలో మార్పును కోరుకుంటారు.
మిథునం
కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సహనం వహించడం మంచిది. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలు ఉంటాయి.
కర్కాటకం
కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. వాటిని ధైర్యంతో అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు.
సింహం
ధైర్యంగా ఉండాలి. ప్రతీ విషయంలో ముందుచూపు ముఖ్యం. కొత్త పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకోవాలి. ఇతరులకు చెడు చేసే పనులకు దూరంగా ఉంటారు.
కన్య
కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. సమాజంలో మంచిపేరు లభిస్తుంది. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు.
తుల
మనస్సు చంచలంగా ఉండడం వలన ఆందోళన అవసరం. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి.
వృశ్చికం
మిక్కిలి ధైర్య సాహసాలతో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గౌరవిస్తారు. శత్రబాధలు ఉండవు. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.
ధనుస్సు
కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త పడడం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతనకార్యాలు వాయిదావేసుకోవల్సి వస్తుంది.
మకరం
బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. మానసిక ఆందోళనలు ఉన్నాయి. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి పాలు అవుతారు.
కుంభం
కోరుకునేది జరగదు. మరోకటి జరుగుతుంది. అనారోగ్య బాధలు ఉన్నాయి. సమయం ప్రకారం భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
మీనం
ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. దైవదర్శన ప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తు, అభరణాలు కొనుగోలు చేస్తారు.