AP: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాయి. పంచమీతీర్థం సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి తిరుచానూరుకు సారెకు తీసుకొచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి టీటీడీ ఊరేగింపుగా సారె తీసుకొచ్చింది. అయితే అమ్మవారికి సారె, కుంకుమ, పసుపు, ఆభరణాలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది. సారెతో పాటు ఆభరణాలను అమ్మవారికి టీటీడీ అలరించనుంది.