శబరిమలలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు మండల పూజలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు మకర విళక్కు పూజలు జరగనున్నాయి. చివరిరోజు పడితో దర్శనాలు ముగియనున్నాయి. జనవరి 14 మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం కలగనుంది. కాగా, మండల, మకర విళక్కు పూజలు ప్రారంభం కాకముందు నుంచే శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేలాది మంది భక్తులు పోటెత్తడంతో తీవ్ర తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.