మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను మారుస్తాయని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. తమ పార్టీకి బలమున్న కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినట్లు తెలిపారు. నవంబర్ 20న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష ‘మహా వికాస్ అఘాడీ’ సీట్ల పంపకంలో భాగంగా ఎస్పీకి 12 స్థానాలు ఇవ్వాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ధూలే నియోజకవర్గం కేంద్రంలో ప్రచారం చేసి.. ఆ అసెంబ్లీ అభ్యర్థిగా ఇర్షాద్ జహాగీర్దార్ను ప్రకటించారు.