చాలా మంది టీ ప్రియులు ఛాయ్‌ని తయారు చేసిన వెంటనే తాగితే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ, కొంతమంది ఒకేసారి ‘టీ’ని తయారు చేసి దాన్నే పదే పదే వేడి చేసి తాగుతారు. అలా తాగితే ప్రమాదకరమని చెబుతున్నారు. ఎక్కువ సేపు నిల్వ ఉంచి వేడి చేసిన టీలో పోషకాలన్నీ తగ్గిపోతాయి. అందులో ఉండే కోల్డ్ టీ బ్యాక్టీరియా పెరిగి అజీర్ణం, ఎసిడిటీ, అధిక రక్తపోటు వంటి వ్యాధులు వస్తాయని వైద్యులు వెల్లడించారు.