TPT: తడ మండలంలో విషాదం నెలకొంది. కారూరు గ్రామంలో ఓ బాలికను విష పురుగు కాటు వేయడంతో మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. తడ పోలీసుల సమాచారం మేరకు.. గ్రామంలో ప్రభాకరన్‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిపారు. కుమార్తె యోగశ్రీని శనివారం తెల్లవారు జామున విష పురుగు కాటు వేసిందని, ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.