SRPT: సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశానికి హాజరైన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని శనివారం తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా నాయకులు దున్న శ్యామ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు రావలసిన డిఏ లను పీ.ఆర్సీని త్వరగా మంజూరు అయ్యేలా చూడాలని వినతిపత్రం అందజేశారు.