GNTR: జనసేన పార్టీలో వైసీపీ నాయకులు చేరారు. శనివారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు నిమ్మల వెంకట రమణ, సంకూరి శ్రీనివాసరావు, ఇర్రి ధనలక్ష్మి, అయిశెట్టి కనకదుర్గ పార్టీలో చేరారు. వీరిని పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఆహ్వానించారు.