»Dy Cm %e0%b0%aa%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d %e0%b0%b8%e0%b0%82%e0%b0%9a%e0%b0%b2%e0%b0%a8 %e0%b0%b5%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%96%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2%e0%b1%81
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకత పాటించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఎలాంటి లంచాలు, రెకమెండేషన్స్ లేకుండా బదిలీలు చేశామని తెలిపారు. లంచం అనే పదం వినిపిస్తే ఆఫీసు నుంచి వెళ్లిపోతారని అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. అలాంటి అధికారులు తన శాఖలో అవసరం లేదని స్పష్టం చేశారు.