TG: రాష్ట్రంలో 2013 నుంచి 2024 వరకు 11 ఏళ్లపాటు పోలీస్ డ్యూటీ మీట్ జరగలేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. HYDలోని రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి CM రేవంత్ హాజరై మాట్లాడారు. పోలీసులు నైపుణ్యాన్ని, పోరాట పటిమను వెలికి తీసే అవకాశం లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పోలీసులకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను వెలికితీస్తున్నట్లు పేర్కొన్నారు.