AP: నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు మరోసారి భారీగా వరద నీరు రావడంతో డ్యామ్ అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 1.11 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే, ప్రాజెక్టుకు 1.90 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులు ఉంది.