ALR: ఇటీవల ముంచంగిపుట్టు మండలం మత్స్యగెడ్డలో నాటుపడవ మునిగి రోగులాపేట గ్రామానికి చెందిన కే.వేణుగోపాలస్వామి అనే గిరిజనుడు గల్లంతయ్యాడు. ఈ మేరకు జీ.మాడుగుల సీఐ సీహెచ్ వెంకటరావు, ముంచంగిపుట్టు ఎస్ఐ రవీంద్ర ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మూడు రోజుల పాటు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎట్టకేలకు శనివారం మృతదేహం లభించిందని సీఐ వెంకటరావు తెలిపారు.