AP: ప్రకాశం జిల్లాలో సుమారు రూ.350 కోట్ల మేర రైతులకు నష్టం కలిగిందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పంటనష్టంపై సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటామని భరోసా కల్పించారు. తమ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.