MNCL: దేశంలో 50 శాతం సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేయాలని శనివారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం సమితి అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లను 50 శాతం పెంచాలని డిమాండ్ చేశారు.