బిష్ణోయ్ కమ్యూనిటీకి తన కుమారుడు క్షమాపణ చెప్పడని సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ అన్నారు. ‘నా కొడుకు కృష్ణజింకను ఎప్పుడూ చంపలేదు. మేము బొద్దింకను కూడా చంపలేము. ఈ విషయాలపై మాకు నమ్మకం లేదు. అతను ఈ నేరం చేయడం మీరు చూశారా, ఈ విషయంపై ఎవరైనా దర్యాప్తు చేశారా?’ అంటూ ప్రశ్నించారు. కాగా, సల్మాన్ ఖాన్ తమ ఆలయంలో క్షమాపణ చెబితే క్షమిస్తామని బిష్ణోయ్ మహాసభ గతంలో పేర్కొంది.