BPT: బాపట్ల కలెక్టర్ కార్యాలయం నందు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(దిశ) సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశంలో కమిటీ ఛైర్మన్ హోదాలో ఎంపీ కృష్ణప్రసాద్ జిల్లా స్థాయి అధికారులతో కలిసి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి అడిగి తెలుసుకున్నారు.