ఏలూరు విద్యానగర్లో దారుణం జరిగింది. ఓ వివాహితపై పలువురు దుండగులు నిన్న రాత్రి యాసిడ్ దాడి చేశారు. రాత్రి ఆ మహిళ స్కూటిపై వెళుతుండగా దుండగులు ఆపి ముఖంపై దాడి చేశారు. బైక్ ను ఆపి యాసిడ్ చల్లి గుర్తుతెలియని వ్యక్తులు పారిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర గాయాలైన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె స్థానిక డెంటల్ క్లినిక్ లో రిసెప్షనిష్టుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమెను మ...
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(Senthil Balaji)కి సంబంధించిన కార్యాలయాల్లో సోదాలు ఈడీ సోదాలు నిర్వహించి అతన్ని అరెస్టు చేసింది. మంత్రి ఉద్యోగాల కోసం అక్రమ నగదు లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఉత్తర నైజీరియా(Nigeria)లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న పడవ(boat) ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో పిల్లలతో సహా దాదాపు 103 మంది మరణించారని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి(kp chowdary)ని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కేపీ చౌదరి గత కొంత కాలంగా గోవాలో ఉంటున్నారు. కబాలి తెలుగు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.
బ్యాంకుల మోసం, మనీలాండరింగ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ టి. వెంకట్‌రామ్‌రెడ్డి(Venkatrami Reddy)తోపాటు ప్రమోటర్లను కూడా ఈడి మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు.
సైబర్ కేటుగాళ్లు కొత్తగా మరో స్కాం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ముద్రాయోజన పథకం(Mudra Yojana scheme) ద్వారా మీరు రూ.20 లక్షల లోన్( rs 20 lakh loan) పొందేందుకు అర్హులని పలువురి ఫోన్లకు మెసేజులు పంపింస్తున్నారు. అంతే నిజమని నమ్మి స్పందిస్తే ఆయా బాధితుల ఖాతాల నుంచి నగదు లూటీ చేస్తున్నారు. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించి వివరణ ఇచ్చింది.
బాచుపల్లిలోని నారాయణ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. మహిళా క్యాంపస్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని వంశిక హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వంశిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కామారెడ్డి జిల్లాకు చెందిన వంశిక ఇటీవల వారం రోజుల క్రితమే క్యాంపస్‌కి వచ్చినట్లు తెలిసింది. అయితే వంశిక బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.