కామారెడ్డి జిల్లాలోని మూడుమామిళ్ల తండాలో నిన్న రాత్రి విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు పాముకాటుతో మృత్యువాత చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మణిపూర్‌లో జరుగుతున్న ఆందోళనల కారణంగా ఇప్పటికి 6 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ రాష్ట్రంలో సగం జిల్లాల్లు చేదాటిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఘర్షణలకు ప్రధాన కారణం ఈ రెండు తెగలకు సంబంధించిన ఈ వివాదాలేనని అంటున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్ పెరుగుతున్న నెపాల్‌గ్యాంగ్‌ల దొంగతనాలు. రామ్‌గోపాల్ పేటలో ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో భారీ మొత్తం చోరీ చేసి నేపాల్ పారిపోవాలని ప్లాన్ వేశారు. మొత్తంగా సినిమాను తలపించే నాటకీయ పరిణామం తరువాత పట్టుబడ్డారు.
మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక తెగకు సంబంధించిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వారికి మరణశిక్ష ఉంటుందని రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ తెలిపారు.
తిరుపతిలో రైలు ప్రమాదం తప్పింది. పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సిబ్బంది అలర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వల్ల పలు రైలు ఆలస్యంగా నడవనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఉత్తరాఖండ్ చమోలీలోని అలకనంద నది ఒడ్డున ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ఘటనలో 15 మంది మృతి, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అలకనంద నది ఒడ్డున జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ చమోలి పరమేంద్ర దోవల్ వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Uttarakhand: Policeman among 10 killed in Chamoli transformer explosion Read @ANI Story | https://t.co/en9...
మిథునం మూవీ రచయిత శ్రీరమణ మృతి చెందారు. ఈరోజు ఊదయం 5 గంటలకు మరణించారు. గతంలో రమణ, బాపుతో కలిసి శ్రీరమణ పనిచేశారు. పేరడి రచనలు చేయడంలో రమణ ఎంతో ప్రఖ్యాతి గాంచారు. దీంతోపాటు నవ్య వారపత్రికకు ఎడిటర్ గా కూడా రమణ పనిచేశారు. “మిథునం” చిత్రంలో వృద్ధ జంట కథ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటుంది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 50 రోజులు ఆడింది. ఇద్దరు వృద్ధాప్య జంటల వైవాహిక సంబంధానికి సంబంధించిన ఈ చిత్రంలో...