కొందరు కారు ఉంటే చాలు బాగా హడావుడి చేస్తారు. కారు ఉందని ఇష్టం ఉన్నట్టుగా రోడ్ల మీద డ్రైవ్ చేస్తుంటారు. సామాన్యుల ప్రాణాలను తీస్తుంటారు. తాజాగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొందరు యువకులు కారులో వెళ్తున్నారు. కారును నిర్లక్ష్యంగా, వేగంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న హేమరాజ్ అనే వ్యక్తిని ఢీకొట్టిన కారు ఏమాత్రం ఆగకుండా అలాగే అతడిని ఈడ్చుకుంటూ కొంత దూరం వరకు వెళ్లింది. దీతో హేమరాజ్ కారు వీల్స్ కింద నలిగిపోయాడు. ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దాని ఆధారంగా పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.