»Jharkhand Elephant News Curfew In Jharkhand Block After Elephant Kills 16 People In 12 Days
jharkhand elephant attack: 12 రోజుల్లో 16 మందిని చంపేసిన ఏనుగు, కర్ఫ్యూ
జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ ఏనుగు (jharkhand elephant attack) అయిదు జిల్లాల్లో గ్రామస్థులను భయాందోళనకు గురి చేస్తోన్న విషయం తెలిసిందే. ఏనుగు కేవలం 12 రోజుల్లో 16 మందిని పొట్టన పెడ్డుకున్నది. ఇందులో ఒక రాంచీ జిల్లాలోనే నలుగురిని చంపేసింది.
జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ ఏనుగు (jharkhand elephant attack) అయిదు జిల్లాల్లో గ్రామస్థులను భయాందోళనకు గురి చేస్తోన్న విషయం తెలిసిందే. ఏనుగు కేవలం 12 రోజుల్లో 16 మందిని పొట్టన పెడ్డుకున్నది. ఇందులో ఒక రాంచీ జిల్లాలోనే నలుగురిని చంపేసింది. దీంతో ఇటకీ బ్లాక్ లో ఐదుగురికి మించి జనం గుమికూడకుండా అధికారులు 144 సెక్షన్ విధించారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో బయటకు రావొద్దని హెచ్చరించారు. ఏనుగుకు దగ్గరగా వెళ్లవద్దని సూచించారు. హజారీబాగ్, రామ్ గడ్, చతరా, లోహర్ దగా, రాంచీ (ranchi) జిల్లాల్లో ఏనుగు రెచ్చిపోతోంది. పదహారు మందిని పొట్టన పెట్టుకున్న దీనిని అడవిలోకి తరలించేందుకు పశ్చిమ బెంగాల్ లోని బాంకుడా జిల్లా నుండి నిపుణులను రప్పిస్తున్నారు. ఏనుగు (elephant) దాడిలో మరణించిన కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు డివిజన్ల ఫారెస్ట్ అధికారులతో (Forest officer) కలిసి రాంచి పారెస్ట్ కన్జర్వేటర్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు తెలిపారు. 16 మందిని చంపింది ఒకే ఏనుగా కాదా అనేది వీరు విచారించనున్నారన్నారు. ఏనుగును బంధించేందుకు లేదా అడవిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
స్థానికంగా ఏనుగులు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాయని, అయినప్పటికీ చనిపోయిన వారిలో ఏనుగులు ఎంతమందిని చంపాయి… అలాగే మృతి చెందిన పదహారు మందిని ఏనుగే చంపిందా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుంటామని ప్రిన్పిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) శశికర్ సమంత తెలిపారు. లోహర్ దగాలో ఏనుగు ఇద్దరు మహిళలతో కలిపి నలుగురిని హత్య చేసిన విషయం గుర్తించామన్నారు. హజారీ బాగ్లోను అదే ఏనుగు పన్నెండు రోజుల క్రితం ఐదుగురిని హతమార్చిందని చెప్పారు. అక్కడి నుండి రామ్ గఢ్‌కు వెళ్లిందని, అక్కడి గోలా ప్రాంతంలో ఒకరిని, ఆ తర్వాత చతరా జిల్లాలో మరొకరిని చంపేసిందన్నారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
ఏనుగుల దాడుల్లో(elephant attacks) ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మృతి చెందుతున్నారు. గత అయిదేళ్లలో అంటే 2017 నుండి జార్ఖండ్‌లో 462 మంది మరణించారని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ మంత్రి సత్య ప్రకాష్ తెలిపారు. 2021-22లో 133 మంది మరణించారని, 2020-21లో 84 మంది మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి.
కాగా, రెండు రోజుల క్రితం దక్షిణ కర్నాటకలోను ఓ ఏనుగు ఇద్దరిని చంపేసింది. పెరడ్క మిల్క్ సొసైటీలో పని చేస్తున్న 21 ఏళ్ల రంజిత సోమవారం ఉదయం తన ఇంటి నుండి మిల్క్ సొసైటీకి వెళ్తోంది. ఆమె ఇంటికి సమీపంలోనే ఏనుగు దాడి చేసింది. ఆమె కేకలు వేయడంతో రమేష్ రాయ్ (51) అక్కడకు వెళ్లాడు. అతని పైన కూడా దాడి చేసింది. ఏనుగు దాడిలో వీరిద్దరు తీవ్రంగా గాయపడటంతో హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. రమేష్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా, రంజిత దారిలో కన్నుమూశారు. పారెస్ట్ డిపార్టుమెంట్ అధికారుల పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.