విశాఖ పరవాడలోని సింహాద్రి ఎన్టీపీసీ(NTPC)లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాద్రి (Sinhadri) ఎన్టీపీసీలో ఎఫ్ జీడీ నిర్మాణ పనులు జరుగుతుండగా, ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కేబుల్ ట్రాక్ బెల్ట్ (Track belt) తెగిపోవడంతో 15 మీటర్ల ఎత్తు నుంచి నిర్మాణ కార్మికులు కిందపడిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులు పశ్చిమ బెంగాల్(West Bengal) కు చెందినవారిగా గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.