విశాఖలో కలకలం రేపిన వివాహిత శ్వేత(Swetha) అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగుచూసింది. శ్వేత భర్త మణికంఠ(manikanta) చెల్లెలి భర్త అయిన సత్యంపై లైంగిక వేధింపుల కేసును పోలీసులు(police Case) నమోదు చేశారు. శ్వేత తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు సత్యంపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
శ్వేత మృతదేహాని(swetha Deadbody)కి పోస్టుమార్టం పూర్తవ్వడంతో ఆ రిపోర్టు కీలకంగా మారింది. అంతేకాకుండా శ్వేత సెల్ ఫోన్ లో కూడా కీలక ఆధారాలు లభించవచ్చని పోలీసులు తెలిపారు. మొబైల్ లాక్ ఓపెన్ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవ్వడంతో విశాఖలోని స్మశాన వాటికలో కుటుంబీకులు శ్వేత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
శ్వేత(Swatha)ది హత్యా(Murder)? లేక ఆత్మహత్యా(suicide)? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 25వ తేదిన రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్వేత 26న ఉదయం బీచ్ లో విగతజీవిగా కనిపించింది. మృతదేహం కనిపించిన తీరుపై పలు అనుమానాలు రేకెత్తాయి. ఈ కేసులో శ్వేత అత్తమామలు, భర్తతో పాటుగా మణికంఠ చెల్లెలి భర్త అయిన సత్యం కూడా శ్వేతను లైంగికంగా వేధించినట్లు శ్వేత తల్లి(swetha mother) ఆరోపించారు.
పెళ్లైనప్పటి నుంచి శ్వేత(swetha) తన అత్తమామలు, భర్త నుంచి వేధింపులు ఎదుర్కొంటోందని, శ్వేతకు పెళ్లి జరిగిన రోజు నుంచే టార్చర్ మొదలైందని శ్వేత తల్లి ఆరోపణలు చేశారు. మణికంఠ చెల్లెలి భర్త సత్యం కూడా శ్వేతపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఆ విషయంలో శ్వేత కుంగిపోయినట్లు తెలిపింది. శ్వేత తన భర్తకు ఆ విషయం చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించింది. మానసికంగా శ్వేత కుంగిపోయిందని, తన కూతుర్ని కాపాడుకోలేకపోయానని శ్వేత తల్లి రమాదేవి ఆవేదన వ్యక్తం చేసింది. శ్వేత తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు(Police Case) చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులకు శిక్ష పడుతుందన్నారు.