• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘కడియం శ్రీహరి రాజీనామా చేయాలి’

JN: కడియం శ్రీహరి నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ పట్టణంలో కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో శుక్రవారం స్పందించిన ఆయన, శ్రీహరి ప్రవర్తన సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని విమర్శించారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వంటి కీలక పదవులు అనుభవించారని పేర్కొన్నారు.

February 20, 2026 / 02:14 PM IST

జడ్చర్లలో నకిలీ ఓట్లు తొలగించాలి: ఎన్నికల కమిషన్

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీలో అనర్హమైన, నకిలీ ఓట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి మున్సిపల్ కమిషనర్‌కు కీలక ఉత్తర్వులు అందాయి. పట్టణంలోని 4వ వార్డుకు చెందిన పెద్ది వెంకటేష్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి గతంలో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఓట్లను జాబితా నుంచి తొలగించాలని కమిషన్ స్పష్టం చేసింది.

February 20, 2026 / 02:13 PM IST

విద్యార్థులకు ఆరోగ్య శిబిరం ఏర్పాటు

SDPT: బెజ్జంకి మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై సూచనలు అందించి, చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయాలన్నారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. కంజంక్టివైటిస్ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి విధానం, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డా. మాధురి, సులోచన, సిస్టర్ అనిత ఉన్నారు.

February 20, 2026 / 02:12 PM IST

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకుడు

NGKL: కల్వకుర్తి పట్టణానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తలసాని ప్రసాద్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బృంగి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.

February 20, 2026 / 02:12 PM IST

ఇందిరమ్మ గృహంతో నెరవేరిన కల

BHNG: రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో మమత గణేష్ దంపతుల ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, నకిరేకల్ నియోజకవర్గానికి తొలి విడతగా 3,500 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 02:11 PM IST

‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవార్డు’కు ఎంపిక

NLG: కనగల్ చెందిన సామాజిక సేవకురాలు డా. కంబాల శివలీల ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవార్డు-2026’కు ఎంపికయ్యారు. గత 12 ఏళ్లుగా ఆమె చేస్తున్న సామాజిక సేవలను గుర్తిస్తూ వాజ్‌పేయి-అద్వాని సేవా సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 22న ఉయ్యాలవాడ వర్ధంతి సందర్భంగా ఆన్‌లైన్ ద్వారా ఈ అవార్డును అందజేయనున్నారు. సంస్థ వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 02:11 PM IST

‘అభివృద్ధిపై చర్చకు సిద్ధం’

SRCL: వేములవాడ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ నేతలు నిమ్మశెట్టి విజయ్, కందుల క్రాంతికుమార్, వెంగళ శ్రీకాంత్ గౌడ్ సవాల్ విసిరారు. వేములవాడలో వారు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. వేములవాడలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ లక్ష్మీనరసింహారావుపై ఆరోపణలు చేస్తే ఊరుకోమని అన్నారు.

February 20, 2026 / 02:07 PM IST

సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

WGL: లంబాడ బంజారా ఆధ్యాత్మిక గురువైన సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు బంజారా జేఏసీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు, నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:06 PM IST

భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. హిందూ సాంప్రదాయం ప్రకారం.. మంచి రోజులు ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తరించారు. ప్రధానంగా చిన్నారుల పుట్టు వెంట్రుకలు, ఇతర శుభ కార్యాల సందర్భంగా రద్దీ ఏర్పడింది. భీమేశ్వరాలయంలో అభిషేకం, అన్న పూల్లో పాల్గొన్నారు.

February 20, 2026 / 02:05 PM IST

నగరంలో ఈనెల 24న నీటి సరఫరా బంద్

KNR: కరీంనగర్ నగరంలోని ఫిల్టర్ బెడ్ వద్దగల 14 MLD సామర్థ్యంగల నీటి సరఫరా వాల్వ్ మరమ్మతుల కారణంగా ఈనెల 24వ తేదీ (మంగళవారం)న నగరం అంతటా తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అలాగే నీటిని పొదుపుగా వాడుకోవాలని, నగరపాలక సంస్థకు సహకరించాలన్నారు.

February 20, 2026 / 02:05 PM IST

బాసర గోదావరిలో గుర్తు తెలియని మహిళ మృతి

NZB: నవీపేట్ మండల పరిధిలోని బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నవీపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

February 20, 2026 / 02:02 PM IST

అంగన్వాడీలో అన్నప్రాసన కార్యక్రమం

MNCL: బెల్లంపల్లి పట్టణం 31వ వార్డులో శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండారి స్రవంతి పాల్గొని చిన్న పిల్లలకు అన్నప్రాసన, గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లు, బాలామృతం పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరి, సహాయకులు సునీత, బస్తీ వాసులు పాల్గొనారు.

February 20, 2026 / 02:01 PM IST

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: గణేష్ రెడ్డి

ADB: అర్హులైన ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించటం జరుగుతుందని తలమడుగు మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి అన్నారు. దేవాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు మేలు చేపడుతుందని పేర్కొన్నారు.

February 20, 2026 / 02:01 PM IST

కళాశాలకు చేరిన ఇంటర్ హాల్ టికెట్స్..!

SRPT: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టిక్కెట్లు కళాశాల లాగిన్‌లోకి చేరాయని నడిగూడెం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ నాయక్ తెలిపారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ పరీక్షలు ముగియడంతో, విద్యార్థులు వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.

February 20, 2026 / 02:01 PM IST

నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: కమిషనర్

MNCL: మురుగు కాలువ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి సూచించారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 13వ వార్డు కాల్ టెక్స్ ఏరియాలో జరుగుతున్న కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. వార్డులోని అన్ని వీధుల్లో కల్వర్టులను త్వరగా నిర్మించాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కౌన్సిలర్ రాజ్ కుమార్, బస్తీవాసులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:01 PM IST