KMM: అధికారం అంటే గద్దె మీద కూర్చోవడం కాదు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం క్షేత్రస్థాయిలో శ్రమించడం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ పోకబత్తిని అనిత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు.
BDK: మూడ్రోజులపాటు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితు ల కారణంగా ఈ నెల 21 నుంచి 24 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 22 న ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లా ల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
ASF: సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు గడువును మార్చి 15 వరకు పొడిగించాలని వాంకిడి మండల రైతులు కోరారు. ఈ మేరకు శుక్రవారం తహసీల్దార్ కవితకు వినతి పత్రం అందజేశారు. ఈ నెల 20తో గడువు ముగియనుండటంతో సమయాన్ని పెంచి అందరికీ న్యాయం చేయాలని కోరారు. మండలంలోని రైతులు పత్తి పంటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని వారు పేర్కొన్నారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఎలిగేడులోని ఆయన నివాసంలో ఇటీవల ఎన్నికైన రామగుండం మున్సిపల్ పాలకవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగరం మేయర్ మహంకాళి స్వామి డిప్యూటీ మేయర్ ఎల్లయ్య ఎమ్మెల్యేని కలిసి నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
SDPT: కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని MP రఘునందన్ రావు స్పష్టం చేశారు. అక్బర్‌పేట్ భూంపల్లి మండలం బొప్పాపూర్‌లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. గ్రామంలో గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షలతో పాటు వివిధ పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.82 లక్షలు కేటాయించడంతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
BDK: చుంచుపల్లి మండలం NK నగర్ బాదావత్ తండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బాదావత్ శ్రీకాంత్ అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలోని సమస్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సత్వరంగా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇందిరా, ఉప సర్పంచ్ మాలోత్ లక్ష్మి పాల్గొన్నారు.
SRD: పుల్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల” పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం పరిశీలించారు. పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగే తిరు కళ్యాణ మహోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. గత 15 ఏళ్లుగా ఆనవాయితీగా ఆయన కుటుంబం వీటిని సమర్పిస్తుంది. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
NLG: నకిరేకల్ పట్టణంలోని మొయిన్ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ నరసింహ స్వామి ఫర్నీచర్ షాపును ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం ప్రారంభించి, యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యమైన వస్తువులను అందించి వినియోగదారుల విశ్వాసాన్ని పొందాలని సూచించారు. మరి కొంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.
MDCL: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) మౌలాలి సర్కిల్ నూతన DGMగా విద్యాసాగర్ వాజపేయి నగర్‌లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం డిఫెన్స్ కాలనీలోని మేనేజర్ కార్యాలయాన్ని సందర్శించగా, HMW మేనేజర్ నవీన్‌తో పాటు సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా లక్ష్యంగా సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.
SRD: పుల్కల్ మండలం సింగూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. తరగతి గదులు, పాఠశాల ఆవరణ, మరుగుదొడ్లు, మెనూ అమలును పరిశీలించారు. అలాగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్ననందున విద్యార్థులు ఏకాగ్రతతో కృషి చేయాలని, పునర్విమర్శ చేయాలని సూచించారు.
MBNR: జడ్చర్ల జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శంకరయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాత బజార్లోనే శంకరయ్య నివాసానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు.
MBNR: జడ్చర్ల జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శంకరయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాత బజార్లోనే శంకరయ్య నివాసానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు.
PDPL: ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామ శివారులో ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో ఎస్సారెస్పీ కాల్వ వంతెనపై ఆటో, బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో బోల్తాపడి అద్దాలు పగిలిపోవడంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆటో డ్రైవర్ వడ్లూరి చిరంజీవి (36), బైక్‌పై ఉన్న గజ్జెల సురేష్ (35) తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులను పోలీసులు చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు.
VKB: పేదలకు వరం ఇందిరమ్మ ఇల్లు అని కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్ అన్నారు. శుక్రవారం 2వ వార్డులోని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు చింతకాయల మొగులమ్మ గృహప్రవేశానికి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.