కేసీఆర్(KCR) నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ కల సాకారమని.. రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలని కోరారు. అక్కడ ప్రభుత్వాల వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెర మీదకు వచ్చిందన్నారు.
పైన అసలైన నోట్లు ఉంచి మధ్యలో నకిలీ నోట్లను ఉంచి తిరుపతి సరఫరా చేస్తున్నాడు. లక్ష రూపాయల అసలు నోట్లకు రూ.3 లక్షల నకిలీ నోట్లను కట్టబెడుతున్నాడని విచారణలో తేలింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో తిరుపతి దొంగనోట్ల సరఫరా చేస్తున్నాడని గుర్తించారు.
తన ఇంటి ముందే ఆమె నివసిస్తుండడంతో వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇది భరించలేక ఆమె భర్త గతేడాది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీటిని తాళలేక ఆమె మహేశ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మంగళవారం రోజు కూలీలతో వెళ్తున్న ఆటోరిక్షాను కారు ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. ఏన్కూరు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరోవైపు గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులను కల్లూరుకు చెందిన వరమ్మ, వెంకటమ్మగా గుర్తించారు. కల్లూరుకు చెందిన కూలీలు ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో వ్యవసాయ పొలంలో పనులకు కోసం వె...
తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు(cyber crimes) తప్ప మిగతా అన్ని రకాల నేరాలు తగ్గాయని డీజీపీ అంజనీ కుమార్(DGP AnjaniKumar) ప్రకటించారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ(cyber literacy) గణనీయంగా పెరిగిందని దాంతో పాటే సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు.
మద్యంమత్తులో కారు నడుపుతూ కొందరు యువకులు వచ్చారు. వారిని అడ్డగించే ప్రయత్నం చేయగా మందుబాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై దురుసుగా ప్రవర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు సహకరించకుండా గొడవ చేశారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లీడర్ వైఎస్ షర్మిల(ys Sharmila)ను నిన్న హైదరాబాద్ లో పోలీసు సిబ్బందిని కొట్టారని ఆరోపణల నేపథ్యంలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. ఆ క్రమంలో ఆమె కోర్టుకు తన వాదనలు వినిపించింది. తనకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు వారెంట్ లేకుండా వచ్చి తనతో దురుసుగా ప్రవర్తించారని తెలిపింది. అంతేకాదు ఓ పురుష ఎస్సై తనను ఎక్కడెక్కడో టచ్ చేశారని చెప్పింది.
గతంలో ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులుగా పని చేసిన వారిని కేసీఆర్ తన వెన్నంటే ఉంచేసుకున్నారు. బిహార్ రాష్ట్రానికి చెందిన సోమేశ్ ను అక్కడి ఎన్నికల్లో పోటీ చేసేలా కేసీఆర్ ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో మధుబని లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు.
తీన్మార్ మల్లన్న టీమ్ లో రాష్ట్ర కన్వీనర్ గా పని చేసిన మాజీ సీఐ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి అరెస్ట్ తో తీన్మార్ మల్లన్న టీమ్ కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే తీన్మార్ మల్లన్న టీమ్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన టీమ్ లోని ప్రధాన వ్యక్తి అరెస్ట్ కావడంతో తీన్మార్ మల్లన్న టీమ్ లో కలకలం రేపింది.