MNCL: క్యాతనపల్లిలో BRS-CPI పొత్తుతో 14 మంది కౌన్సిలర్లు గెలిచినప్పటికీ 7 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో ఛైర్మన్ పీఠం కోసం మంత్రి వివేక్ అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని TBGKS నాయకులు ఆరోపించారు. సోమవారం మందమర్రిలో మాట్లాడారు. మంత్రి వివేక్‌కు అక్రమ అరెస్ట్‌ల మీద ఉన్న శ్రద్ధ, అభివృద్ధి మీద లేదని, పోలీసుల వెనుక దాక్కుని రాజకీయం చేయడం మానుకోవాలన్నారు.
హన్మకొండ నగరంలోని ఎస్ టీ పీటర్స్ ఫార్మసీ కళాశాలలో సోమవారం జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుబేదారి ఎస్సై ఫణి హాజరై యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి విక్రయం లేదా వినియోగంపై సమాచారం ఉంటే 8712584473కు తెలియజేయాలని, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్‌ను వినియోగించాలని సూచించారు.
BDK: మణుగూరు ఏరియాలో నిద్రమాను వృక్షాల నరికివేతపై అటవీ శాఖ జిల్లా ఫారెస్ట్ ఏవో కే.ఎస్.ఎన్ మూర్తికి సామాజిక సేవకులు కర్నే బాబురావు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సుమారు యాభై సంవత్సరాలు వయసున్న నిద్రమాను చెట్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా నరికించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
NZB: నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన పస్క రాజు పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లగా గుండె పోటుతో మరణించారు. పది రోజుల తర్వాత రాజు మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరింది. రాజు కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం ఆదుకునేలా చూస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు. గల్ఫ్‌లో ఉన్న మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చిన NRIలకు బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.
PDPL: క్రీడలలో ప్రతిభ సాధించిన పోలీస్ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్- 2026లో పాల్గొని బహుమతులు సాధించిన పోలీసులను సోమవారం కమిషనరేట్లో అభినందించారు. విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్రీడలలో రాణించడం గర్వకారణం అన్నారు.
NRML: రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని ఏఎస్పీ సాయికిరణ్ అన్నారు. అరైవ్ అలైన్ రెండవ దశ కార్యక్రమంలో భాగంగా సోమవారం మామడ మండలంలోని లింగాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని, మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు.
WGL: గ్రేటర్ WGL మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు దామెర్పుల స్వరూప-సాంబయ్య దంపతుల కుమారుడు అనిల్ కుమార్-శ్రావణి వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే KR నాగరాజు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వధూవరులకు బహుమతి అందజేశారు.
RR: న్యాయవాదులపై దాడులను అరికట్టాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని న్యాయవాదులందరూ సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ న్యాయవాద బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో న్యాయవాద బార్ అసోసియేషన్ సభ్యులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. న్యాయవాద రక్షణ చట్టం అమలు చేయాలని తెలిపారు.
ఆసిఫాబాద్ మండలం మాణిక్ వాడలోని 115 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారి రాకేశ్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు ఆసిఫాబాద్, వాంకిడి, రెబ్బెన, సిర్పూర్ (టీ), బెల్లంపల్లి ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. పనులు పూర్తి కాగానే సరఫరా పునరుద్ధరిస్తామనన్నారు.
జనగామ: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు అన్నారు. నాగర్ కర్నూల్ ఘటనను నిరసిస్తూ.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, జఫర్గడ్ ఎమ్మార్వోకు సోమవారం వినతిపత్రం అందించారు. బాధితులపై చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తూ, కాంగ్రెస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతుని మండిపడ్డారు.
హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా పీ. సాంబమూర్తి, ప్రధాన కార్యదర్శిగా మండలోజు కృష్ణమూర్తి, కోశాధికారిగాక ఐలయ్య, ఉపాధ్యక్షులుగా హసన్ పాషా జీ. వెంకటనారాయణ ఎంపికయ్యారు.
MLG: మహిళా కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా జిల్లాలోని అన్ని మండలాలకు మహిళా కాంగ్రెస్ ఇంఛార్జీలను ప్రకటించారు. మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి ఈ ప్రకటన చేశారు. మండల ఇంఛార్జీలు గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్ఠం చేస్తామన్నారు.
HYD: సీఎం రేవంత్ రెడ్డి దేవాదుల ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేరళ ఎన్నికలకు నిధులు సమకూర్చుకోవడానికి సీఎం దేవాదుల పనులను తెరపైకి తెచ్చారని, ఇది మైండ్ గేమ్ అని ఆయన మండిపడ్డారు. కేరళ ఎన్నికలకు రూ.1000 కోట్లు పంపడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారన్నారు.
WNP: వీపనగండ్ల మండలంలోని సర్వే నెంబర్ 721లో 16 ఎకరాల 20 గుంటల భూమిని రాజకీయ నాయకులు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాలని వనపర్తి ప్రజావాణిలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి వినతి పత్రాన్ని అందజేశారు. అధికారులు చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
NGKL: కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష దాడి, శిశువు మృతి ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీరియస్ అయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ.. నిందితుడైన సర్పంచిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణమే రక్షణ కల్పించి, భారీ నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.