• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. హిందూ సాంప్రదాయం ప్రకారం.. మంచి రోజులు ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తరించారు. ప్రధానంగా చిన్నారుల పుట్టు వెంట్రుకలు, ఇతర శుభ కార్యాల సందర్భంగా రద్దీ ఏర్పడింది. భీమేశ్వరాలయంలో అభిషేకం, అన్న పూల్లో పాల్గొన్నారు.

February 20, 2026 / 02:05 PM IST

నగరంలో ఈనెల 24న నీటి సరఫరా బంద్

KNR: కరీంనగర్ నగరంలోని ఫిల్టర్ బెడ్ వద్దగల 14 MLD సామర్థ్యంగల నీటి సరఫరా వాల్వ్ మరమ్మతుల కారణంగా ఈనెల 24వ తేదీ (మంగళవారం)న నగరం అంతటా తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అలాగే నీటిని పొదుపుగా వాడుకోవాలని, నగరపాలక సంస్థకు సహకరించాలన్నారు.

February 20, 2026 / 02:05 PM IST

బాసర గోదావరిలో గుర్తు తెలియని మహిళ మృతి

NZB: నవీపేట్ మండల పరిధిలోని బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నవీపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

February 20, 2026 / 02:02 PM IST

అంగన్వాడీలో అన్నప్రాసన కార్యక్రమం

MNCL: బెల్లంపల్లి పట్టణం 31వ వార్డులో శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండారి స్రవంతి పాల్గొని చిన్న పిల్లలకు అన్నప్రాసన, గర్భిణులు, బాలింతలకు కోడిగుడ్లు, బాలామృతం పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరి, సహాయకులు సునీత, బస్తీ వాసులు పాల్గొనారు.

February 20, 2026 / 02:01 PM IST

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: గణేష్ రెడ్డి

ADB: అర్హులైన ప్రజలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించటం జరుగుతుందని తలమడుగు మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి అన్నారు. దేవాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు మేలు చేపడుతుందని పేర్కొన్నారు.

February 20, 2026 / 02:01 PM IST

కళాశాలకు చేరిన ఇంటర్ హాల్ టికెట్స్..!

SRPT: ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టిక్కెట్లు కళాశాల లాగిన్‌లోకి చేరాయని నడిగూడెం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ నాయక్ తెలిపారు. ఇప్పటికే ప్రాక్టికల్స్ పరీక్షలు ముగియడంతో, విద్యార్థులు వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.

February 20, 2026 / 02:01 PM IST

నిర్మాణ పనులను వేగవంతం చేయాలి: కమిషనర్

MNCL: మురుగు కాలువ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి సూచించారు. శుక్రవారం బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 13వ వార్డు కాల్ టెక్స్ ఏరియాలో జరుగుతున్న కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. వార్డులోని అన్ని వీధుల్లో కల్వర్టులను త్వరగా నిర్మించాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కౌన్సిలర్ రాజ్ కుమార్, బస్తీవాసులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:01 PM IST

ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సందర్శించిన వైద్యులు

BDK: మణుగూరు మండలం అశోక్ నగర్‌లో చేపట్టిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని వైద్యులు పుల్లారెడ్డి సందర్శించారు. మన ఇంటి పరిసరాల్లో దోమలు పుట్టకుండా అవి పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు పుల్లారెడ్డి, సునీల్ తెలిపారు. అనంతరం హాస్టల్ లోని కిచెన్, స్టాక్ రూమ్‌లను పరిశీలించి తగు సూచనలు చేశారు.

February 20, 2026 / 02:01 PM IST

నేత్రదానంతో ఇద్దరి జీవితంలో వెలుగులు

MNCL: బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంపు బస్తిలో శుక్రవారం మరణించిన చెందిన విశ్రాంత సింగరేణి ఉద్యోగి బింగి అశోక్ కుమార్ కళ్ళను జానహిత సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్‌వీ ప్రసాద్‌ హైదరాబాద్‌ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు దానం చేశారు. మృతి చెందినా ఇతరులకు కంటి చూపు అందించి వారికి వెలుగును అందించడానికి నేత్రదానం చేసినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

February 20, 2026 / 02:01 PM IST

BC సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా అజయ్

SRCL: బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర కార్య దర్శిగా కొప్పుల అజయ్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ పట్టణానికి చెందిన కొప్పుల అజయ్ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం కార్యదర్శిగా నియమితులు కావడం పట్ల స్థానిక బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

February 20, 2026 / 02:01 PM IST

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుడదు: ఎమ్మెల్యే

RR: ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగాలని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. SDNR మున్సిపల్ ఛైర్మన్‌గా బస్వం పదవి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మాట్లాడుతూ.. వార్డుల వారిగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు.

February 20, 2026 / 02:00 PM IST

అదుపుతప్పి వాహనం బోల్తా..

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం నుంచి ముత్తారం వైపు వెళ్తున్న ఓ సీడ్ కంపెనీకి చెందిన బొలెరో వాహనం బోల్తా పడింది. మార్గం మధ్యలో వాహనం అదుపుతప్పడంతో పంటపొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. సీడ్ యాజమాన్యం బోల్తా పడ్డ వాహనాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీసింది

February 20, 2026 / 01:56 PM IST

పట్టణ అభివృద్ధికి కట్టుబడాలి: ఎమ్మెల్యే జారే

BDK: అశ్వారావుపేట మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన బాధ్యత ఎంతో ఉన్నత మైందని ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం పట్టణ అభివృద్ధికి కట్టుబడి పని చేయడం ప్రతి ఒక్కరికీ బాధ్యత అని గుర్తు చేశారు.

February 20, 2026 / 01:49 PM IST

ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు తప్పనిసరి: AEO

MBNR: గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామంలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ గడువు సమీపిస్తుండటంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధి పొందేందుకు రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని AEO వరలక్ష్మి సూచించారు. ఆధార్ భూ యాజమాన్య పాస్‌బుక్, బ్యాంక్ వివరాలతో సమీప మీసేవ కేంద్రాల్లో నమోదు చేయాలని తెలిపారు. ఫిబ్రవరి 28 చివరి తేదీగా ఉండటంతో గడువులోపు నమోదు పూర్తి చేయాలని కోరారు.

February 20, 2026 / 01:45 PM IST

సమస్య పరిష్కారానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే

BDK: ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అనుసరించాలని ప్రజలకు సత్వర న్యాయం అందజేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఇల్లందు డిఎస్పీగా నూతనంగా నియమితులైన వెంకన్న బాబు శుక్రవారం ఎమ్మెల్యే కోరం కనకయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన డీఎస్పీనీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లందు ప్రాంతంలో శాంతిభద్రతలపై ఇరువురు చర్చించారు.

February 20, 2026 / 01:42 PM IST