• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అమరవాయి గ్రామంలో పింఛన్ల పంపిణీ సౌకర్యం

GDWL: అమరవాయి గ్రామ వృద్ధులు, దివ్యాంగుల పింఛన్ల అందుబాటును సులభతరం చేయడానికి సర్పంచ్ పి. హుస్సేన్ పంచాయతీలోనే పంపిణీ చేపట్టాలని సూచించారు. శుక్రవారం ఆయన మహబూబ్ నగర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్ని కలసి వినతిపత్రం అందజేశారు. అధికారి సానుకూల స్పందన తెలిపినట్లు సర్పంచ్ తెలిపారు.

February 20, 2026 / 01:42 PM IST

జీవన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి

JGL: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం జగిత్యాల జిల్లాలో తన అధికారిక పర్యటనలను వాయిదా వేసుకున్నారు. అనంతరం కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి జీవన్ రెడ్డిని పరామర్శించారు.

February 20, 2026 / 01:41 PM IST

విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు

BHNG: బీబీనగర్ మండలం ప్రాథమిక పాఠశాల వెంకిర్యాలలో విద్యార్థులందరికీ ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. చెవి, ముక్కు, గొంతు, కళ్ళ, సైకియాట్రిస్ట్ డాక్టర్లు వ్యక్తిగతంగా ఆరోగ్య పరీక్షలు చేశారు. అవసరమైన విద్యార్థులకు ఇయర్ డ్రాప్స్ అందించారు. విద్యార్థులకు కళ్ళజోడు ఉచితంగా పంపిణీ చేస్తానన్నారు.

February 20, 2026 / 01:40 PM IST

కామారంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం

MDK: చిన్నశంకరంపేట(మం) కామారం రెండో వార్డులో శుక్రవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను సర్పంచ్ గడ్డం సుజాత, ఉప సర్పంచ్ సుధాకర్ ప్రారంభించారు. జీపీ నిధులతో ఈ పనులు చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ సైట్ ఇంజినీర్ మహేందర్, గ్రామ కార్యదర్శి సుమలత, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

February 20, 2026 / 01:38 PM IST

మంత్రిని కలిసిన మున్సిపాలిటీ చైర్ పర్సన్, సభ్యులు

NRPT: మక్తల్ నియోజకవర్గం అమరచింత మున్సిపాలిటీ చైర్‌పర్సన్ జింక సువర్ణ రవి, వైస్ చైర్ పర్సన్ రాధా అరుణ్, కౌన్సిలర్లు శుక్రవారం మక్తల్‌లో స్థానిక ఎమ్మెల్యే,రాష్ట్ర క్రీడా పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరిను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనంతరం మంత్రి వారిని అభినందించారు. మంత్రి మాట్లాడుతూ.. మున్సిపాలిటీని కలిసి కట్టుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 01:38 PM IST

ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు

BDK: ఇల్లందు మండలం ఇందిరానగర్ గ్రామ పంచాయతీలో ప్రజా ప్రభుత్వంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళు గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం కుటుంబ సమేతంగా హాజరయ్యారు. పేదలందరినీ ఆదుకోవాలని ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వారితోపాటు స్థానిక నూతన పాలకవర్గం పాల్గొన్నారు.

February 20, 2026 / 01:36 PM IST

పేదల సొంతింటి కల నెరవేరుస్తాం: ఛైర్మన్

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ 8వ వార్డు పరిధిలో శుక్రవారం పలువురు లబ్దిదారుల ఇళ్లకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి తెలిపారు, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని. ముందుకురాని లబ్దిదారుల కోసం ప్రైవేట్ సంస్థ ద్వారా ఇళ్ల నిర్మాణ ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.

February 20, 2026 / 01:35 PM IST

లేగ దూడపై చిరుత దాడి కలకలం

SRCL: వేములవాడ రూరల్ మండలం హనుమక్కపల్లిలో చిరుతపులి దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన రోమాల భూమయ్యకు చెందిన లేగదూడపై చిరుత దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖ రేంజ్ అధికారి ఖలీలుద్దీన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరుతపులి అడుగులను గుర్తించారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు.

February 20, 2026 / 01:35 PM IST

పదవీ బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ చైర్మన్

RR: షాద్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్‌గా బస్వం, వైస్ ఛైర్మన్‌గా అందె మోహన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షాద్‌నగర్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సారథ్యంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చేస్తామన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అన్ని వార్డులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.

February 20, 2026 / 01:34 PM IST

పదవీ బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ ఛైర్మన్

RR: షాద్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్‌గా బస్వం, వైస్ ఛైర్మన్‌గా అందె మోహన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షాద్‌నగర్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సారథ్యంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చేస్తామన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అన్ని వార్డులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.

February 20, 2026 / 01:34 PM IST

పదవీ బాధ్యతలకు స్వీకరించిన మున్సిపల్ చైర్మన్

RR: షాద్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్‌గా బస్వం, వైస్ ఛైర్మన్‌గా అందె మోహన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షాద్‌నగర్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సారథ్యంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చేస్తామన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అన్ని వార్డులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.

February 20, 2026 / 01:34 PM IST

పాలకుర్తికి రానున్న మాజీ మంత్రి హరీష్ రావు

JN: పాలకుర్తి మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన సాక్షి రిపోర్టర్ మాతృమూర్తి ఇటీవల మరణించారు. వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈరోజు మధ్యాహ్నం 2:00 గంటలకు మాజీ మంత్రి, శాసనసభ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు రానున్నట్లు బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ తెలిపారు.

February 20, 2026 / 01:31 PM IST

రవిదాస్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

SRD: రామచంద్రాపురంలో సంత్ గురు రావిదాస్ బోధనలు సమాజంలో సమానత్వం, ప్రేమ పెంపొందించాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం భారతి నగర్ బొంబాయి కాలనీలో గురు రవిదాస్ 649వ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోచి కులస్తుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు.

February 20, 2026 / 01:30 PM IST

‘అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి’

KMR: రాజంపేట పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆకాంక్షించారు. శివాయిపల్లి గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ ఆలయ వార్షికోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.

February 20, 2026 / 01:28 PM IST

జిల్లాస్థాయి భజన పోటీలో మిడ్జిల్‌కు రెండో బహుమతి

MBNR: జడ్చర్ల మండలం కుర్వగడ్డ పల్లి గ్రామంలోని శ్రీ పరుశవేధిశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మిడ్జిల్కి చెందిన శ్రీ మాత ఇద్దమ్మ దేవి భజన మండలి రెండో బహుమతి సాధించింది. నిర్వాహకులు విజేతలకు రూ.80,106తో పాటు మెమొంటో అందజేసి అభినందించారు. భక్తుల భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

February 20, 2026 / 01:27 PM IST