• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జాలర్‌కి చిక్కిన అరుదైన రబ్బర ఫిష్

కోనసీమ: సఖినేటిపల్లి ( M ) అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో రంగుల రబ్బర్ ఫిష్ జాలరికి చిక్కి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇది సుమారు ఒక కేజీ ఉన్నట్లు జాలర్లు తెలిపారు. ఈ రబ్బర ఫిష్ మొదటిసారిగా హర్బర్‌కు రావడం వల్ల అక్కడ ప్రజలంతా దాన్ని వింతగా చూశారు .

February 21, 2026 / 05:14 AM IST

మీకోసం కార్యక్రమానికి 81 ఫిర్యాదులు

అల్లూరి: పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయని వివరించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

February 21, 2026 / 05:13 AM IST

పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎస్పీ

ADB: ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించిన అనంతరం మహిళా సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గదిని ప్రారంభించారు. గ్రామాల్లో వీపీఓ విధానం అమలు చేస్తూ గంజాయి, గుడుంబా జరగకుండా రాయితీ బియ్యం, పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలలో సీసీటీవీ ఏర్పాటు చేయాలన్నారు.

February 21, 2026 / 05:11 AM IST

‘పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి’

ADB: ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించిన అనంతరం మహిళా సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గదిని ప్రారంభించారు. గ్రామాల్లో వీపీఓ విధానం అమలు చేస్తూ గంజాయి, గుడుంబా జరగకుండా రాయితీ బియ్యం, పశువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలలో సీసీటీవీ ఏర్పాటు చేయాలన్నారు.

February 21, 2026 / 05:11 AM IST

నేడు, రేపు రాష్ట్ర చదరంగం పోటీలు

TPT: రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు నేడు, రేపు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి షఫీదర్ తెలిపారు. షాప్ లీగ్ పోటీల్లో ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీనివాస క్రీడా సముదాయంలో ఈ పోటీలు జరగనున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు.

February 21, 2026 / 05:09 AM IST

గెస్ట్ లెక్చరర్ పోస్టుకు నేడే ఇంటర్వ్యూ

MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు ఆంగ్ల మాధ్యమంలో బోధించే అభ్యర్థులకు నేడు (శనివారం) మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూ, డెమోకు హాజరుకావాలని ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు. ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారు ఉదయం 10 గంటలకు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలని పేర్కొన్నారు.

February 21, 2026 / 05:08 AM IST

నేడు చిన్నగంజాంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

BPT: చిన్నగంజాం మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు మండల ఏఈ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు లైన్ల మరమ్మతుల పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పెద్దగంజాం, కొత్తపాలెం, ములగనవారిపాలెం, నీలాయపాలెం, రాజుబంగారుపాలెం గ్రామాల్లో కరెంటు ఉండదని కావున ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.

February 21, 2026 / 05:05 AM IST

మైనార్టీల కోసం ప్రత్యేక పథకాలు

KNR: రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రెండు స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించిందని జిల్లా మైనారిటీ అధికారి వి.జగదీశ్వర్ తెలిపారు. tgobmms పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.1.50 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.1.20 లక్షల సబ్సిడీ, ముస్లిం బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన వారికి రూ.60వేల యూనిట్ విలువతో పథకం అమలు చేస్తున్నామన్నారు.

February 21, 2026 / 05:05 AM IST

రేపు ‘సండే ఆన్ సైక్లింగ్’

TPT: క్రీడల్లో యువతను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం ఉదయం 6 గంటలకు ‘సండే ఆన్ సైక్లింగ్’ పేరుతో తిరుపతిలో కార్యక్రమం నిర్వహించనున్నారు. రోడ్డు పైన సైక్లింగ్, పలు క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్రీడాభిమానులు పాల్గొనాలని శాప్ జిల్లా క్రీడాభివృద్ధ అధికారి షణ్ముఖర్ తెలిపారు.

February 21, 2026 / 05:04 AM IST

ఎమ్మెల్యే గిడ్డి నేటి పర్యటన వివరాలు

కోనసీమ: పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బుధవారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు అయినవిల్లి మండల, విలాస గ్రామంలో 36లక్షల వ్యయంతో నిర్మించబోతున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌కు శంకుస్థాపన చేస్తారు. 10:45 గంటలకు పి. గన్నవరం మండలం ముంగండలో పవన్ అన్న ఆరోగ్య భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభిస్తారు.

February 21, 2026 / 04:55 AM IST

ఈనెల 23న కాకినాడలో మెగా జాబ్ మేళా

KKD: కాకినాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఈ నెల 23న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్(పీడీ) లచ్చారావు శుక్రవారం ప్రకటించారు. పదో తరగతి నుంచి ఆపై చదువులు చదివిన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకే వికాస కార్యాలయానికి చేరుకోవాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 04:45 AM IST

ఆర్థిక పునరావాస సహాయ పథకానికి ఇంటర్వ్యూలు

SRCL: దివ్యాంగులకు ఆర్థిక పునరవాస సహాయ పథకానికి ఇంటర్వ్యూలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం నిర్వహించారు. జిల్లాకు ఆర్థిక సహాయ పునర్వాస పథకం కింద 14 యూనిట్లు మంజూరయ్యాయి. 30 మంది దరఖాస్తు చేసుకోగా 35 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమ అగర్వాల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. సర్టిఫికెట్లు, అర్హత పత్రాలు పరిశీలించారు.

February 21, 2026 / 04:37 AM IST

నేడు ఈ గ్రామాలలో పవర్ కట్

KKD: కిర్లంపూడి మండలంలోని సింహాద్రిపురం, చిల్లంగి, జగపతినగరం, కిర్లంపూడి గ్రామాల్లో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జగ్గంపేట ఈఈ వీరభద్రరావు తెలిపారు. ప్రత్తిపాడు సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా, లైన్ల నిర్వహణ పనుల నిమిత్తం ఈ కోత విధిస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

February 21, 2026 / 04:34 AM IST

లోకేశ్ ఆత్మీయ విందు మర్చిపోలేనిది: ఎమ్మెల్యే

మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన ‘డిన్నర్ ఆత్మీయ సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. కేవలం రాజకీయాలే కాకుండా, చాలా సరదాగా గడిచిన ఈ సమయం మర్చిపోలేనిదని.. ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆదిరెడ్డి తన మనసులో మాట చెప్పారు. మంత్రి లోకేశ్ ఎంతో ఆప్యాయంగా కుటుంబ సభ్యులందరినీ పలకరించారని పేర్కొన్నారు.

February 21, 2026 / 04:31 AM IST

సంక్షేమ పథకాలే లక్ష్యంగా ఫ్యామిలీ సర్వే’: కలెక్టర్

E.G: ఏపీ ప్రభుత్వం స్వర్ణగ్రామ/స్వర్ణవార్డ్ ఆధ్వర్యంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ పథకాల పారదర్శక అమలు, లబ్ధిదారులకు వేగంగా సేవలు అందించేందుకు సమగ్ర డేటా సేకరించడమే ఈ సర్వే ఉద్దేశమని పేర్కొన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు తప్పనిసరిగా వివరాలు అందించాలన్నారు.

February 21, 2026 / 04:28 AM IST