KRNL: ఆస్పరి మండల ప్రజలకు CI ఏ. గంగాధర్ పలు సూచనలు చేశారు. పక్క మండలాల్లో చైన్ స్నాచింగ్, దొంగతనాలు జరుగుతున్నాయని, ఈ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానస్పద వ్యక్తులపై దృష్టి పెట్టి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మహిళలు, వృద్ధులు ముఖ్యంగా చైన్లు ధరించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎటువంటి సమాచారం కోసమైనా 9121101159కు సంప్రదించాలన్నారు.
కోనసీమ: సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రామచంద్రపురం ఉపాధి భవన్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి సుభాష్ కార్యాలయం తెలిపింది. 10వ తరగతి నుంచి డిప్లమా వరకు చదివిన 18-27 ఏళ్ల యువత అర్హులు. నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశమని, పెద్ద ఎత్తున పాల్గొనాలని అధికారులు కోరారు. ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.
సత్యసాయి: పరిగి మండలంలోని శాసనకోట గ్రామ పంచాయతీలో ఆదివారం మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటించనున్నట్లు మండల వైసీపీ కన్వీనర్ నరసింహమూర్తి తెలిపారు. ఆదివారం సాయంత్రం 3 గంటలకు ‘కాఫీ విత్ వైసీపీ లీడర్స్’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని తెలిపారు. అనంతరం గ్రామ కమిటీల నిర్మాణంపై నాయకులతో చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొనాలని కోరారు.
ఖమ్మం నగరంలోని DPRC భవనంలో నూతన సర్పంచులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రజల నమ్మకాన్ని గెలిచి ఎన్నికైన సర్పంచులు గ్రామ పాలనలో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సర్పంచుల బాధ్యతలతో పాటు ప్రజలకు అందించాల్సిన సేవలపై ఆయన సమగ్ర అవగాహన కల్పించారు.
ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురు విద్యార్థులను డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవీ రమణ తెలిపారు. అనంతపురం శ్రీ చైతన్య కళాశాలలో ముగ్గురు, గుత్తి MS డిగ్రీ కళాశాలలో ఒకరు, హిందూపురం బాలాజీ విద్యామందిర్‌లో ఒకరిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
NZB: రెంజల్ మండలం పేపర్ మిల్ గ్రామంలో శనివారం తహసీల్దార్ శ్రావణ్ కుమార్ అక్రమ ఇసుక డంపులను సీజ్ చేశారు. అనుమతి లేకుండా నిల్వ ఉంచిన 26 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో తనను అడ్డుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ రవాణా చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
MBNR: బాలానగర్ మండలంలోని మోతీ ఘనపూర్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. మోతీ ఘనపూర్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఆయా గ్రామాల ప్రజలు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
భువనగిరిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో అడ్మిషన్‌తో పాటు 6, 7, 8, 9వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆదివారం ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
MDK: ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు. మొత్తం విద్యార్థులు-12,334, ఫస్ట్ ఇయర్ జనరల్-5710, ఫస్ట్ ఇయర్ ఒకేషనల్-599, మొత్తం-6309, సెకండ్ ఇయర్ జనరల్–5472, సెకండ్ ఇయర్ ఒకేషనల్-533, మొత్తం-6025, పరీక్ష కేంద్రాలు -28, ఫ్లైయింగ్ స్క్వాడ్-5 ఉన్నట్లు వెల్లడించారు.
KRNL: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు.
TG: కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్-బీజేపీ సవాళ్ల వివాదం ఇంకా సద్దుమణగలేదు. సోమవారం కలెక్టరేట్‌లో తేల్చుకుందామని MLA సవాల్ విసిరారు. దీంతో MLA KVRపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో BJP రాష్ట్ర నాయకులు కామారెడ్డికి రాకుండా అక్కడ పోలీసులు మోహరించారు. ఇప్పటికే బీజేపీ చీఫ్ రాంచందర్‌రావును హౌస్ అరెస్ట్ చేశారు.
SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని తాంబేలు గుట్టపై జ్యోతిర్లింగ శివాలయ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి స్వామివారికి ప్రత్యేకంగా స్వలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
TG: మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సంబంధించి ఈ ఏడాది అర్హులైన బీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ తెలిపింది. ఈనెల 23 నుంచి మార్చి 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి వయస్సు 35 ఏళ్లు నిండకూడదు. డిగ్రీలో తప్పనిసరిగా 60 శాతం మార్కులు ఉండాలి.
KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరగుతున్న డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన 18 మంది విద్యార్థులను శనివారం డిబార్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. 10,263 మంది విద్యార్థులకు గాను 9,387 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు వెల్లడించారు.
CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.144 నుంచి రూ.150, మాంసం రూ.209 నుంచి 234 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.238 నుంచి రూ.260 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ.75 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.