• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

23 నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ

MNCL: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈనెల 23 నుంచి నస్పూర్‌లోని మంచిర్యాల కలెక్టరేట్‌లో యధాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని, తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని వెల్లడించారు.

February 21, 2026 / 06:51 PM IST

బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడు మృతి

SKLM: శ్రీకాకుళం నుంచి పాలకొండకు వెళ్తున్న బస్సులో శనివారం సాయంత్రం ఓ ప్రయాణికుడు గుండెపోటుతో రావడంతో చింతాడ వద్ద బస్సును నిలుపుదల చేసి 108కి చెప్పండి సమాచారమిచ్చారు. దీంతో 108 చేరుకుని బస్సులో ఉన్న ప్రయాణికుని 108లోకి ఎక్కించే సమయంలో ప్రయాణికుడు మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది .

February 21, 2026 / 06:50 PM IST

సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

KMM: వైరా నియోజకవర్గం పాత తండాలోని రైతు వేదికలో శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన జాతి అభ్యున్నతికి సేవాలాల్ మహారాజ్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

February 21, 2026 / 06:48 PM IST

సంఘం బస్తీలో గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇంట్లో ప్రమాదం

ASF: కాగజ్ నగర్ సంఘం బస్తీలో శనివారం గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇంట్లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అక్కడ ఉన్న పలువురికి గాయాలవ్వగా, స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద తీవ్రతకు ఇంటి సామాగ్రి ధ్వంసమైంది. పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

February 21, 2026 / 06:48 PM IST

హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితురాలు అరెస్ట్

RR: చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పుష్కరని వద్ద జరిగిన కరుణాకర్ హత్య కేసును పోలీసులు చేదించారు. పోలీసుల వివరాలు.. గత ఆరేళ్లుగా కలిసి ఉంటున్న కరుణాకర్, బాలమని శివరాత్రి జాతర సందర్భంగా పుష్కరిని వద్ద మద్యం సేవించారు. డబ్బులు విషయంలో వాగ్వాదం జరగడంతో కరుణాకర్ పై కట్టెతో బాలమణి దాడి చేసి పుష్కరిణిలో తోసేయగా మృతి చెందాడు. నిందితురాలు బాలమణిని పోలీసులు అరెస్టు చేశారు.

February 21, 2026 / 06:48 PM IST

బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

కర్ణాటక రాజకీయాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే చంద్రూలమానీ అరెస్ట్ అయ్యారు. రూ.10 లక్షల లంచం తీసుకున్న కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన ఇద్దరు పీఏలను కూడా అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన పీఏ మంజునాథ్ వాల్మీకి, ప్రైవేట్ సహాయకుడు గురు లమానీలను కూడా అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

February 21, 2026 / 06:46 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు: మంచిరెడ్డి

HYD: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలను అడ్డుకున్నారని పేర్కొన్నారు. కోర్టు స్టే పేరుతో ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని ఆరోపించారు. 

February 21, 2026 / 06:45 PM IST

డీజిల్ లోకో షెడ్‌ను తనిఖీ చేసిన డీఆర్‌ఎం

VSP: వాల్తేరు రైల్వే డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా శనివారం డీజిల్ లోకో షెడ్‌ను పరిశీలించారు. కొనసాగుతున్న కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక మార్పుల పురోగతిని సమీక్షించారు. సిమెన్స్ సంస్థ ద్వారా 300 లోకోమోటివ్‌ల నిర్వహణ కోసం చేపట్టిన ప్రాజెక్ట్ పురోగతిపై ప్రత్యేకంగా చర్చించారు.

February 21, 2026 / 06:45 PM IST

అగ్రి షోలు రైతులకు మార్గదర్శకం: సునీల్ కుమార్

BHPL: ఆధునిక వ్యవసాయ పద్ధతుల పై అవగాహన కల్పించేందుకు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం BHPL, కాటారం డివిజన్‌లకు చెందిన 50 మంది రైతులను HYDలో జరుగుతున్న “రైతుబడి అగ్రి షో”కు తీసుకెళ్లారు. ఆధునిక సాంకేతికత అవలంబిస్తే తక్కువ వ్యయంతో అధిక దిగుబడులు సాధ్యమని, ఇలాంటి అగ్రి షోలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

February 21, 2026 / 06:43 PM IST

గుడ్లవల్లేరులో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

కృష్ణా: గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా శాఖల వారీగా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత పరిస్థితులు, పెండింగ్ పనులపై ఎంపీడీవో ఇమ్రాన్ సమీక్షించారు. ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు సేవలను సమర్థవంతంగా అందించాలని అధికారులకు సూచించారు.

February 21, 2026 / 06:42 PM IST

‘ఇంటర్ పరీక్షలకు పూర్తయిన ఏర్పాట్లు’

NRML: ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు డీఐఈవో పరుశురాం శనివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 23 కళాశాలలో ఉండగా పరీక్షలకు 13125 మంది విద్యార్థులు హాజరవుతున్నారని మొదటి సంవత్సరం 6652, ద్వితీయ సంవత్సరం 6473 మంది విద్యార్థులు హాజరవుతుండగా వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

February 21, 2026 / 06:42 PM IST

మెగా వైద్య శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

HNK: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా శిబిరంలో ఓపీ నమోదు, ,ప్రాథమిక పరీక్షల కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. అలాగే ఫార్మసీ కౌంటర్‌ను సందర్శించి అందుబాటులో ఉన్న మందుల గురించి ఆరాతీశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

February 21, 2026 / 06:41 PM IST

మద్యంకు బానిసై యువకుడు ఆత్మహత్య

MDCL: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అలవాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శనివారం అల్వాల్ పోలీసులు తెలిపిన ప్రకారం.. పోలీస్ స్టేషన్ పరిధి హస్మత్‌పేట్ హరిజన్ బస్తీలో ముద్దంగుల బాలు (33) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యం కోసం డబ్బులు లేకపోవడంతో ఇంట్లో తలుపులు వేసుకుని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడన్నారు.

February 21, 2026 / 06:40 PM IST

కేంద్రమంత్రికి పొంగులేటి విజ్ఞప్తి

TG: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అన్ని రకాల సహకారాలు అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‍చౌహాన్‍ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి కోరారు. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్‍కు విచ్చేసిన కేంద్రమంత్రిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ఏడాది 3లక్షల ఇళ్లు, వచ్చే ఏడాది మరో 2 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.

February 21, 2026 / 06:39 PM IST

మునగాలలో ప్రమాదం.. అదుపుతప్పి లారీ బోల్తా

SRPT: మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కాటన్ లోడుతో వెళుతున్న లారీ, రాంగ్ రూట్‌లో వస్తున్న మరొక వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ సల్ప గాయాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 06:39 PM IST