• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రామయ్య ముత్యాల తలంబ్రాల కోసం భారీ విరాళం

BDK: శ్రీరామ నవమి సందర్భంగా జరిగే కళ్యాణ తలంబ్రాల కోసం భక్తులు రూ.4 లక్షల విరాళాన్ని అందించారు. హైదరాబాద్ వాస్తవ్యులు ముప్పాల భవాని ప్రసాద్, యుగంధర్ రూ.4 లక్షలను విరాళంగా భద్రాచలం దేవస్థాన ప్రాంగణంలో అందజేశారు. ఈ విరాళాన్ని భక్తిశ్రద్ధలతో భద్రాచలం దేవస్థానం ఈవో దామోదర్‌కి అందజేశారు. అనంతరం రామయ్యను దర్శించుకున్నారు.

February 26, 2026 / 08:23 AM IST

రేషన్ అక్రమాలపై విజిలెన్స్ నిఘా

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాల శాఖ నిఘా పెంచింది. నెలకు రెండుసార్లు గోదాములు, దుకాణాల్లో తనిఖీలు చేయనున్నారు. బియ్యం దళారులకు విక్రయించే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు డీలర్‌ షిప్‌ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

February 26, 2026 / 08:23 AM IST

టీడీపీలో చేరిన వైసీపీ నేత రామకోటచారికి

NTR: తిరువూరుకు చెందిన వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి రామడుగు రామకోటచారి బుధవారం టీడీపీలో చేరారు. విజయవాడ గురునానక్ కాలనీ ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేసినేని చిన్ని రామకోటచారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ శివనాథ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీలో సుమచిత గుర్తింపు ఉంటుందన్నారు.

February 26, 2026 / 08:22 AM IST

ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

PLD: రొంపిచర్ల మండలంలోని గోగులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న యున్న అభయాంజనేయ స్వామికి గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. 31వ ఆలయ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను అర్చకులు కృష్ణమాచార్యులు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణ చేశారు. మహిళలు పొంగళ్లు నిర్వహించి, మొక్కుబడులను తీర్చుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్నారు.

February 26, 2026 / 08:18 AM IST

మద్యం తాగి నడిరోడ్డు పై వ్యక్తి హల్ చల్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ బుధవారం రాత్రి ఒక వ్యక్తి మద్యం తాగి చల్ సృష్టించాడు. వివరాల్లోకి వెళితే గుర్తు తెలియని వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ కిందపడ్డాడు. అతన్ని లేపి సపర్యలు చేస్తున్న స్థానిక ప్రజలు విచక్షణ కోల్పోయి  ఇష్టానుసారంగా దుర్భాషలాడుతుండడంతో స్థానికులు ట్రాఫిక్ పోలీసులను పిలిపించి అప్పగించారు.

February 26, 2026 / 08:16 AM IST

జోరుగా నూతన ఓటర్ల నమోదు.. మీరూ చేసుకోండి..!

HYD: GHMC, CMC, MMC ప్రాంతాల్లో నూతన ఓటర్ల ప్రక్రియ జోరుగా సాగుతుంది. ఒక్కో నియోజకవర్గంలో కేవలం 3 నెలల్లోనే సుమారు 2500 పైగా నూతన ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. మీరు మీ చేతిలోని ఫోన్ ద్వారా సైతం ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. Voter help line యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, ఫామ్ నెంబర్-6 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని రిటర్నింగ్ ఆఫీసర్లు తెలిపారు.

February 26, 2026 / 08:15 AM IST

మిర్చి యార్డులో రైతులకు భోజన సదుపాయం

గుంటూరు మిర్చి యార్డులో అన్నదాతల కోసం గురువారం నుంచి భోజన పథకం ప్రారంభం కానుంది. టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో, అధికారులు గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక వ్యక్తికి అల్పాహారం, భోజనం కలిపి రూ. 88.25 ధరగా నిర్ణయించారు (టిఫిన్ రూ. 20, భోజనం రూ. 68.25). యార్డు ఛైర్మన్ కుర్రా అప్పారావు, కార్యదర్శి చంద్రికలు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

February 26, 2026 / 08:15 AM IST

వెంకటేశ్వర స్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

అనకాపల్లి పట్టణం భీముని గుమ్మం వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అధికారులు హుండీలను తెరచి లెక్కించారు. కానుకల రూపంలో రూ.4,26,767 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి చంద్ర తేజ తెలిపారు. 50 రోజులకు ఈ ఆదాయం లభించినట్లు పేర్కొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

February 26, 2026 / 08:15 AM IST

నాగచైతన్య ‘వృషకర్మ’ అప్‌డేట్

నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘వృషకర్మ’. నిధి అన్వేషకుడైన ‘అర్జున్’ పాత్రలో చైతూ కనిపిస్తాడని సమాచారం. మార్చి 5న ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

February 26, 2026 / 08:14 AM IST

ఎల్లమ్మ తల్లి సిద్ధోగంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సిద్ధోగంలో బుధవారం రాత్రి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగుండాలని, ఎల్లమ్మ తల్లిని వేడుకున్నట్టు తెలిపారు.

February 26, 2026 / 08:12 AM IST

మున్సిపల్ పనులపై కలెక్టర్ సమీక్ష

KMR: జిల్లా IDOC సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్, PMAY-U, అమృత్ పనుల పురోగతి, ఆస్తి పన్ను వసూళ్లు, విపత్తు నిర్వహణ చర్యలపై చర్చించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కార్యాచరణ ప్రణాళిక, శానిటేషన్, ప్లాంటేషన్, తొలగింపుపై నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు.

February 26, 2026 / 08:12 AM IST

ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

VSP: ఫిజియోథెరపీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన గాజువాక ఉడా కాలనీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైడా రజిని (21) అనే విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్లో వెల్లడించింది. న్యూపోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 26, 2026 / 08:10 AM IST

గరికపాటి ప్రవచనం వినడం ఎంతో ఆనందం: మంత్రి

PDPL: మీ ప్రవచనం వినడం ఎంతో ఆనందం కలిగించిందని, ఎందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం స్థానిక శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం శ్రీ మణికంఠ ప్రాంగణంలో నిర్వహించిన గరికపాటి నరసింహారావు ప్రవచనం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముక్కు సూటిగా మాట్లాడే తత్వం కలిగిన గరికపాటి ప్రవచనం చెప్పేవారు ఈ దేశంలో మరి ఎవరు లేరని అన్నారు.

February 26, 2026 / 08:10 AM IST

వచ్చే నెల 7న జిల్లా స్థాయి యోగా పోటీలు

KRNL: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 7వ తేదీన కర్నూలు డీఎస్ఏ స్టేడియంలో జిల్లాస్థాయి బాలికల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యోగా సంఘం వర్కింగ్ ప్రెసిడెంటు డా.ఎస్. ముంతాజ్బేగం ఇవాళ తెలిపారు. 7- 9 ఏళ్లు, 10- 13 ఏళ్లు, 14- 18 ఏళ్ల విభాగాల్లో పోటీలు జరుగుతాయని వెల్లడించారు. వివరాలకు 7981515467 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

February 26, 2026 / 08:10 AM IST

అక్బర్‌పేటలో ఆలయ ప్రధానార్చకులు మృతి

SDPT: చౌదర్‌పల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ పార్వతీ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయ ప్రధానార్చకులు, వంశపారంపర్య ధర్మకర్త, ఆధ్యాత్మిక సేవకుడు దుబ్బరాజం పంతులు బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన మరణవార్తతో గ్రామంలో విషాదం నెలకొంది. ఎన్నో దశాబ్దాలుగా ఆలయ సేవలో నిమగ్నమై భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా నిలిచిన దుబ్బరాజాం పంతులు భక్తి,సేవాభావానికి ప్రతీకగా నిలిచారు.

February 26, 2026 / 08:10 AM IST