• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మైనర్ బాలికపై అత్యాచారం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

GNTR: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబులునాయుడుపాలెంలో 16 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 24న బాలికను ప్రలోభపెట్టి, బెదిరింపులకు గురిచేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరారీలో ఉన్న నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకుని, వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

March 4, 2026 / 07:52 AM IST

IND vs ENG సెమీస్: ‘అన్నీ సుపరిచిత వ్యూహాలే’

T20 WCలో భారత్, ఇంగ్లండ్ వరుసగా 3వ సారి సెమీస్‌లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరస్పరం సంధించుకునేందుకు రహస్య ఆస్త్రాలేమీ లేవని, ఎవరి వ్యూహాలు ఏంటనేది ఇరుజట్లకూ తెలుసని ఇంగ్లండ్ ప్లేయర్ సామ్ కరన్ పేర్కొన్నాడు. రేపు వాంఖడేలో భారత్‌పై విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్తామని ధీమా వ్యక్తంచేశాడు. అభిషేక్ కోసం ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.

March 4, 2026 / 07:52 AM IST

వైసీపీ సమన్వయకర్తగా పీటా నాగ మోహన్ కృష్ణ

BPT: రేపల్లె నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా పీటా నాగ మోహన్ కృష్ణను నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ నిర్ణయంపై వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ.. నాగ మోహన్ కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.

March 4, 2026 / 07:47 AM IST

పుట్లూరు మండలంలో వరుస చోరీలు

ATP: పుట్లూరు మండలంలో వ్యవసాయ పొలాల వద్ద వరుసగా విద్యుత్ కేబుల్ చోరీలు జరుగుతుండటంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా పి.చింతలపల్లి గ్రామంలో పబ్లిక్ మోటర్‌తో పాటు సర్పంచ్ రామకృష్ణారెడ్డికి చెందిన కేబుల్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గత కొద్ది రోజులుగా మండలంలో ఈ దొంగతనాలు నిరంతరం కొనసాగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 4, 2026 / 07:46 AM IST

చెక్కు బౌన్సు కేసులో ఆరునెలల జైలు

TPT: ఏడు చెక్కు బౌన్సు కేసుల్లో బెంగళూరుకు చెందిన డా. సోమసుందర్‌ రెడ్డికి ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ తిరుపతి నాలుగో అదనపు మున్సిప్ కోర్టు న్యాయమూర్తి గ్రంధి శ్రీనివాస్ మంగళవారం తీర్పు వెలువరించారు. డా. బి.చంద్రపాణి వద్ద రూ.31.37 లక్షలు అప్పు తీసుకుని జారీ చేసిన ఏడు చెక్కులు బౌన్సు కావడంతో కేసులు నమోదయ్యాయి.

March 4, 2026 / 07:44 AM IST

అక్రమంగా పశువులను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు

MNCL: అనుమతి లేకుండా పశువులను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు లక్సెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ ప్రకటనలో తెలిపారు. SI వివరాల ప్రకారం మంచిర్యాల నుంచి కరీంనగర్ అనుమతి పత్రాలు లేకుండా బొలేరో వాహనాల్లో 12 పశువులను తరలిస్తుండగా NTR చౌరస్తాలోకి అదుపులోకి తీసుకున్నాం. తొగరు మురళి, నారా కిరణ్, చెన్నూరు లక్ష్మయ్య పై కేసు నమోదు చేశామన్నారు.

March 4, 2026 / 07:44 AM IST

సీఎం సమావేశంలో పాల్గొన్న ఆసిఫాబాద్ కలెక్టర్

ASF: హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత పాల్గొన్నారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై CM దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ నివేదికను సమర్పించారు.

March 4, 2026 / 07:43 AM IST

గోకఫసల్వాడ్‌లో ఘనంగా కాముని దహనం కార్యక్రమం

VKB: గోక ఫసల్వాడ్‌లో హోలీ పండుగను పురస్కరించుకుని కాముని దహనం కార్యక్రమాన్ని గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో గ్రామ సర్పంచ్ మల్లమ్మ, ఉప సర్పంచ్ చంద్రప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.​ సర్పంచ్ మల్లమ్మ గారు మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే ఈ పండుగ, గ్రామంలో సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు.

March 4, 2026 / 07:43 AM IST

జనవాసాల మధ్యకు వచ్చేస్తున్న జింకలు

VSP: నగరంలో కాంక్రీట్ నిర్మాణాలు పెరగడంతో వన్యప్రాణులు దారి తప్పుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం విశాలాక్షినగర్ నివాస ప్రాంతంలో ఒక అడవి జింక సంచరించింది. కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యం నుంచి ఆహారం, నీటి కోసం ఇవి జనావాసాల్లోకి వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. జింకలు, దుప్పులు వీధి కుక్కల దాడులు, వాహన ప్రమాదాలకు గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్దున్నారు.

March 4, 2026 / 07:43 AM IST

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

నిన్న చంద్రగ్రహణం కావడంతో తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. స్వామి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా.. భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 27,300 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.46 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

March 4, 2026 / 07:40 AM IST

రేపటి నుంచే సీతారాముల డోలా మహోత్సవాలు

VZM: సంతకవిటి మండలంలోని గుళ్ళ సీతారామపురంలో 500 ఏళ్ల చరిత్ర గల సీతారాముల డోలా మహోత్సవం మార్చి 5-7 తేదీల్లో జరుగుతుందని ఈవో మాధవరావు తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ఫాల్గున శుద్ధ ఏకాదశి బదులుగా 5 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అర్చకుడు బోగాపురుపు ప్రసాదు చెప్పారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్ రావు రవీంద్ర తెలిపారు.

March 4, 2026 / 07:40 AM IST

పట్టుబడిన ముఠా సభ్యులు వీరే: CP

NZB: అంతర్ రాష్ట్ర కాపర్ కాయిల్స్ దొంగల ముఠాను NZB పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముఠాలో అఫ్టల్ ఖాన్, అర్బాజ్, అన్సార్, షేక్ తాహెర్, సిద్ధిక్ ఖాన్, మమ్మద్ అప్సర్, మహబూబ్ ఖాన్, షేక్ ఆరిఫ్, మహమ్మద్ రాజా, బోర్గే బాలాజీ అను 10 మంది ముఠా సభ్యుల్లో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండు తరలించినట్లు CP సాయి చైతన్య చెప్పారు.

March 4, 2026 / 07:39 AM IST

జూద శిబిరంపై దాడి.. రూ.1,10,690 స్వాధీనం

కృష్ణా: పెనమలూరు పోలీసులు కానూరులో మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఆటోనగర్‌లో కొందరు కోతముక్కలు ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీ చేసి, 9 మంది జూదం ఆడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,10,690ల నగదు, పేకముక్కలు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 4, 2026 / 07:38 AM IST

మట్టిరోడ్డుపై నిత్య పోరాటం

VZM: సంతకవిటి మండలం మల్లయ్యపేట-హొంజరాం మట్టి రహదారి అధ్వానంగా తయారైంది. ఇటీవల కురిసిన వర్షానికి బురదమయంగా మారింది. ఈ మార్గంలోనే చింతలపేట, మల్లయ్యపేట, మంతిన, రామ రాయపురం తదితర గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

March 4, 2026 / 07:36 AM IST

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం

AP: నాలుగు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. బడ్జెట్ సమావేశాలు పదమూడో రోజులో భాగంగా ఈరోజు 3 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. APPSC చట్ట సవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్, అగ్నిమాపక సేవా సవరణ బిల్లును హోంమంత్రి అనిత ప్రవేశపెట్టనున్నారు.

March 4, 2026 / 07:36 AM IST