• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

లోకేష్‌పై అంబటి ఆగ్రహం

AP: తనను 100 సార్లు జైలుకు పంపినా.. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడనని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. జనసేన ఆఫీసులో రెండు వాహనాలపై దాడి చేస్తే క్షణాల్లో విచారించిన ఎస్పీ, ఐజీ.. తన ఇంటిపై ఏడు గంటల పాటు దాడి జరిగితే ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే తన ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

February 28, 2026 / 06:12 PM IST

ఈ ప్రాంతాల ప్రజలకు GOOD NEWS

HYD: కొకాపేట్, నియోపోలిస్ ప్రాంతంలో 3.95 ఎకరాల భూమిని ప్రభుత్వం జలమండలికి కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ స్థలంలో భారీ రిజర్వాయర్ నిర్మించి, కోకాపేట, నియో పోలీస్, ఓల్డ్ సిటీ, షేక్ పేట, రెడ్ హిల్స్, మెహిదీపట్నం ప్రాంతాలకు గ్రావిటీ ద్వారా మంచినీరు సరఫరా చేస్తారు. అంతేకాక.. బోజగుట్ట రిజర్వాయర్‌కు నీరు సరఫరా చేయనున్నారు.

February 28, 2026 / 06:11 PM IST

డా.బాబు రాజేంద్రప్రసాద్ సేవలు చిరస్మరణీయం

KNR: కథలాపూర్ మండలం సిరికొండ యువజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం రోజున భారతదేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ 63వ వర్ధంతిని నిర్వహించారు. బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ రచనలో బాబు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలి శ్రీనివాస్, గాంధారి శ్రీనివాస్, నాంపల్లి శ్రీధర్, మహేష్, మధుసూదన్, సతీష్ పాల్గొన్నారు.

February 28, 2026 / 06:11 PM IST

‘సీసీ రోడ్డు, కమిటీ హాల్ మంజూరు చేయాలి’

ADB: నార్నూర్ మండలంలోని పలువురు సర్పంచులు శనివారం మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఏజెన్సీ ప్రాంతమైన నార్నూరులోని పలు గ్రామాల్లో ఉన్న రహదారులు అధ్వానంగా మారాయన్నారు. దీంతో నూతన సీసీ రోడ్డు, కమిటీ హాల్, నీటి బోర్ వేల్స్ మంజూరు చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఆత్రం పరమేశ్వర్, మహాదు, రాహుల్ పాల్గొన్నారు.

February 28, 2026 / 06:10 PM IST

యుద్ధం సెగ.. భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. ఒక్కరోజే తులం బంగారంపై రూ.4,000 పెరిగి రూ.1,68,710 (24K)కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,650గా ఉంది. వెండి కిలోకు రూ.25,000 పెరిగి రూ.3,20,000 మార్కును తాకింది. యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లు వీటిని సురక్షిత పెట్టుబడిగా భావించడంతో ధరలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి.

February 28, 2026 / 06:10 PM IST

రేషన్ కార్డుదారులకు అలర్ట్

ATP: జిల్లాలోని 6,74,333 రైస్ కార్డుదారులకు మార్చి నెల నిత్యావసర సరుకులను సిద్ధం చేసినట్లు జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు. రేపటి నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు. బియ్యం, జొన్నలు, రాగులు ఉచితంగా అందజేస్తామని, మున్సిపాలిటీ పరిధిలో గోధుమపిండి పంపిణీ ఉంటుందని పేర్కొన్నారు.

February 28, 2026 / 06:07 PM IST

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సమీక్ష

TPT: తిరుపతిలో కే.ఎం.ఎస్ 2025 ఖరీఫ్–రబీ ధాన్యం కొనుగోళ్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాంతీయ సమీక్ష నిర్వహించారు. రైతులకు MSP చెల్లింపులు సమయానికి జరగాలని, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్ సోరబ్ గౌర్ పాల్గొన్నారు.

February 28, 2026 / 06:06 PM IST

చికిత్స పొందుతున్న 15 మంది బాధితులు

E.G: రాజమండ్రిలో కల్తీ పాలు ఘటనలో ప్రభావితమైన 15 మంది రోగులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని DMHO కే.వెంకటేశ్వర రావు శనివారం తెలిపారు. కిమ్స్‌లో 8 మంది, డెంటల్ లో ఇద్దరు, RACCలో ఒకరు, రవి చైతన్యలో ఒకరు, రెయిన్బోలో ముగ్గురు చిన్న పిల్లలు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. బాధితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

February 28, 2026 / 06:06 PM IST

తాజ్ పూర్‌లో సైన్స్ ఫెయిర్

BHNG: భువనగిరి మండలం తాజ్‌పూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం వైభవంగా సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సైన్స్ ఫేర్‌లో విద్యార్థులు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన పలు నమూనాలు, ప్రాజెక్టులు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.

February 28, 2026 / 06:04 PM IST

WOW.. సకల సౌకర్యాలతో హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్

RR: హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌ను అమృత్ స్టేషన్ పథకం కింద రూ.29.21 కోట్ల వ్యయంతో ఆధునికంగా తీర్చిదిద్దారు. 12 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. నూతన ముఖచిత్రం, విస్తృత వేచి ఉండే హాల్స్, మెరుగైన సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు సికింద్రాబాద్ డివిజన్ DRM గోపాలకృష్ణన్ వెల్లడించారు.

February 28, 2026 / 06:04 PM IST

హెల్త్ క్లినిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLR: కొడవలూరు మండలం గౌతమి నగర్ పంచాయతీలో హెల్త్ క్లినిక్ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పింఛన్లను పంపిణీ చేసి, చెత్త సంపద రిక్షాలను పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. రూ.36 లక్షలతో హెల్త్ క్లినిక్‌ను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

February 28, 2026 / 06:03 PM IST

మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి

E.G: పెరవలి ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు.

February 28, 2026 / 06:03 PM IST

ఇంటర్ పరీక్షకు 5 మంది గైర్హాజరు

PDPL: ధర్మారంలో సాధన జూనియర్ కాలేజీలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆంగ్ల పరీక్షకు 5 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు చీఫ్ సూపరింటెండెంట్ వెల్లడించారు. మొత్తం 143 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా, 138 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు.

February 28, 2026 / 06:03 PM IST

జాతీయ సైన్స్ దినోత్సవంలో పాల్గొన్న జిల్లా జడ్జి

NRML: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు చేపట్టిన ప్రదర్శన అభినందనీయమని సీనియర్ జడ్జి రాధిక అన్నారు. సారంగాపూర్ మండలం చించోలి మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరై సివి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు సైన్స్ యొక్క ప్రాధాన్యతను వివరించారు.

February 28, 2026 / 06:02 PM IST

‘100 రోజుల ఆరోగ్య మిషన్’

WNP: మహిళల సంపూర్ణ ఆరోగ్య వివరాలు సేకరించి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం హెల్త్ మిషన్ 100 పేరుతో బృహత్తర కార్యక్రమం శ్రీకారం చుట్టిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా డీఎంహెచ్వో కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. మార్చి 2 నుంచి జూన్ 9 వరకు 30 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

February 28, 2026 / 06:01 PM IST