• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైసీపీ జిల్లా SM కార్యదర్శిగా పెదపాటి చిన్నబాబు

E.G: వైసీపీ జిల్లా సోషల్ మీడియా కార్యదర్శిగా పెదపాటి చిన్నబాబును నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. గోపాలపురం నియోజకవర్గంలోకి చెందిన చిన్నబాబు, పార్టీ పథకాలు, కార్యాచరణను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తానేటి వనితకు కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 06:02 PM IST

‘భూ తాగాదాలకు పరిష్కారం-రాజీ మార్గమే’

PPM: బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, దానికి కఠిన శిక్షలు తప్పవని లోక్ అదాలత్ సభ్యులు మరియు సీనియర్ న్యాయవాది టీ. జోగారావు అన్నారు. శనివారం గరుగుబిల్లిలో పార్వతీపురం మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా జోగారావు మాట్లాడుతూ.. భూతగాదాలు సమాజ శాంతి భద్రతపై ప్రభావం చూపుతాయని అన్నారు.

February 21, 2026 / 06:02 PM IST

క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధికి రూ. లక్ష విరాళం

AKP: ఎస్ రాయవరం మండలం రేవు పోలవరంలో యువత కోసం క్రికెట్ గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. దీని అభివృద్ధి కోసం గ్రామానికి చెందిన వాసుపల్లి అడవిరాజు రూ. లక్ష విరాళాన్ని ప్రకటించారు. శనివారం చెక్కును రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా గ్రామ యువతకు అందజేశారు. క్రీడలను ప్రోత్సహించడానికి దాతలు ముందుకు రావాలని హోం మంత్రి పిలుపునిచ్చారు.

February 21, 2026 / 06:02 PM IST

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్

SDPT: దుబ్బాక మండలం రామక్కాపేట గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె. హైమావతి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల వసతి చదువుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దని ఉపాధ్యాయులకు సూచించారు.

February 21, 2026 / 06:02 PM IST

మదనపల్లిలో బీజేపీ శిక్షణ మహాభియాన్ ప్రారంభం

అన్నమయ్య: మదనపల్లిలోని కృష్ణ కళ్యాణ మండపంలో ‘పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026’ కార్యక్రమం శనివారం జరిగింది. BJP పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుష్పలత మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో శిక్షణ తరగతులు నిర్వహించాలని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో ఈ శిక్షణలు కీలకమని ఆమె సూచించారు.

February 21, 2026 / 06:02 PM IST

‘దొంగతనాల నివారణకు ముందస్తు చర్యలు’

NRPT: దొంగతనాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన చౌరస్తాల్లో పోలీస్ సిబ్బందితో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల చేతి వేలి ముద్రలను ప్రత్యేక డివైజ్‌తో తనిఖీ చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

February 21, 2026 / 06:02 PM IST

‘ఆస్తి పన్ను గడువులోగా చెల్లించాలి’

నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల ప్రజలు ఆస్తి పన్నును గడువులోగా చెల్లించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారి రాజు శనివారం ప్రకటనలో తెలిపారు. పన్నుల వసూలుకు 18 బృందావనం ఏర్పాటు చేశామని ఇందుకోసం వార్డు ఆఫీసర్లు ఇంటింటా తిరుగుతూ పన్నులను వసూలు చేస్తున్నారని ఆయా వార్డ్ ఆఫీసర్లకు తమ పన్నులను చెల్లించి అధికారులకు సహకరించాలని తెలిపారు.

February 21, 2026 / 06:02 PM IST

కుప్పనపూడిలో గోమాతకు శ్రీమంతం

W.G: ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామంలో వైసీపీ ఆకివీడు మండల అధ్యక్షులు నంద్యాల లక్ష్మి సీతారామయ్య స్వగృహం వద్ద శనివారం వేద పండితుల వేద ఆశీర్వచనాలతో గోమాతకు శ్రీమంతం చేశారు. గోమాతను పూజిస్తే సుఖశాంతులు కలుగుతాయని తెలిపారు. నంద్యాల లక్ష్మీ సీతారామయ్య దంపతులు, పవన్ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.

February 21, 2026 / 06:02 PM IST

రోడ్డు భద్రతపై విద్యార్థులకు పోలీసుల అవగాహన

సత్యసాయి: పరిగిలోని సేవా మందిర్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డ్రగ్స్ నివారణ, రోడ్డు భద్రత, బాల్య వివాహాలు, ఫోక్సో చట్టాలపై డీఎస్పీ నర్సింగప్ప అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.

February 21, 2026 / 06:00 PM IST

గవిమఠం శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి సన్నిధిలో విశ్వేశ్వర రెడ్డి

ATP: ఉరవకొండలో గవిమఠం శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠం పీఠాధిపతిని కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. రథోత్సవానికి తరలివచ్చిన భక్తులతో ఆయన ముచ్చటించారు.

February 21, 2026 / 06:00 PM IST

‘డ్రగ్ ఫ్రీ జీవనం గడపాలని పోలీసుల పిలుపు’

KDP: ముద్దనూరు పట్టణంలోని డిగ్రీ కళాశాలలో ఈరోజు యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, ఆరోగ్యం-భవిష్యత్తుపై ప్రభావం, చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో డ్రగ్ ఫ్రీ జీవనం గడపాలని, అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

February 21, 2026 / 06:00 PM IST

రేణుకా యల్లమ్మను దర్శించుకున్న అనంతపురం ఎంపీ

KRNL: కోసిగి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరేణుకా యల్లమ్మ ఆలయాన్ని శనివారం అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఆలయంలో ఆయన కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 21, 2026 / 06:00 PM IST

సోషల్ మీడియా ద్వారా పాలకుల దృష్టికి సమస్యలు

NLR: సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకువెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం(M) గజ్జలవారిపల్లికి విద్యార్థులు రోడ్డు లేదని SM ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది.

February 21, 2026 / 06:00 PM IST

నంద్యాలలో రోడ్డు పనులతో ట్రాఫిక్ సమస్య

నంద్యాలలోని శ్రీనివాస సెంటర్ నుండి సంజీవ నగర్ సర్కిల్ వరకు జరుగుతున్న రహదారి పనుల వల్ల ఇవాళ తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) నేతలు అధికారుల నిర్లక్ష్యాన్ని విమర్శించారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించాలని కోరారు. పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

February 21, 2026 / 06:00 PM IST

క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేసిన ఎమ్మెల్యే

SKLM: క్రీడలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతి ఇస్తుందని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శనివారం సాయంత్రం ఆమదాలవలస మున్సిపాలిటీ జగ్గు శాస్త్ర పేట గ్రామం వద్ద ఉన్న ఎన్టీఆర్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో సౌత్ జోన్ నేషనల్ సాఫ్ట్ బాల్ కోచింగ్ క్యాంపెయిన్‌ను స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.

February 21, 2026 / 05:55 PM IST