• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటర్ పరీక్షలకు ఎంతమంది హాజరైనారు అంటే..!

KDP: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 62 కేంద్రాల్లో 15,159 మంది నమోదు కాగా, 14,777 మంది హాజరై 97 శాతం హాజరు నమోదైంది. మొత్తం 382 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 14,011 మందిలో 13,691 మంది హాజరై 320 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,148 మందిలో 1,086 మంది పరీక్షలు రాయగా 62 మంది హాజరుకాలేదు.

February 24, 2026 / 04:17 PM IST

పులికాట్ అంతర్రాష్ట్ర వివాద పరిష్కారానికి ఎంపీ కృషి

TPT: పులికాట్ సరస్సు అంతర్రాష్ట్ర జల వివాద సమస్య పరిష్కారం కోసం ఎంపీ మద్దిల గురుమూర్తి జిల్లా కలెక్టరును కలిశారు. మత్స్యకారుల సమస్యలపై ఎంపీ చర్చలు తెలిపారు. మత్స్యకారులు సరిహద్దులు మార్చి చేపల వేట కొనసాగిస్తున్నారని కలెక్టరుకి వివరించారు. మత్స్యకారులు స్నేహభావంతో వ్యవహరించి గొడవలకు దూరంగా ఉండాలని ఎంపీ పిలుపునిచ్చారు.

February 24, 2026 / 04:15 PM IST

‘కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి’

HNK: రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీపీఎం పార్టీ కాజీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో కాజీపేట తహసీల్దార్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య మాట్లాడుతూ.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు, అయోధ్యపురం భూ-నిర్వాసితులకు, అప్రెంటిస్ చేసిన యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.

February 24, 2026 / 04:15 PM IST

మహంకాళి ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం

PLD: ఇస్సప్పాలెం మహంకాళి అమ్మవారి ఆలయ నూతన నిర్మాణానికి భక్తులు విరాళాలతో ముందుకు వస్తున్నారు. మంగళవారం పెద్దరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అలపర్తి వెంకటేశ్వర్లు, అన్నపూర్ణమ్మ దంపతుల కుమారుడు రూ.1,01,116 నగదును ఆలయ ఈవో నలబోతు మాధవిదేవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

February 24, 2026 / 04:15 PM IST

ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి

కృష్ణా: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కృష్ణా డెల్టాలోని జల వనరుల శాఖ ఔట్ సోర్సింగ్ లస్కర్లు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈఅవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును కలిసి వినతిపత్రం అందచేశారు. తమకు ఏడాదిలో 8-10 నెలలు కాకుండా 12నెలలకూ జీతాలు ఇవ్వాలని కోరారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని కోరారు. ప్రభుత్వం జీతాలు సకాలంలో ఇవ్వాలని కోరారు.

February 24, 2026 / 04:14 PM IST

‘అన్ని సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం’

PPM: వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడమే ప్రధానమని, అందుకు తగిన విధంగానిర్మాణం చేపట్టాలని కలెక్టర్ డా, ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. మౌలిక వసతులతో పాటు గాలి వెలుతురు ఉండాలని తేల్చి చెప్పారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

February 24, 2026 / 04:13 PM IST

సేవాలాల్ జయంతి వేడుకకు ఎస్పీకి ఆహ్వానం

BDK: మార్చి 1న లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్ లక్ష్మణ నాయక్ తెలిపారు. కొత్తగూడెం సేవాలాల్‌ మహారాజ్‌ 287వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజును గిరిజన లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు కోరారు. మంగళవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.

February 24, 2026 / 04:13 PM IST

మధు పార్క్ రిడ్జ్ బాధితులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్యే

RR: మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ల బఫర్ జోన్ వివాదంపై MLA ప్రకాష్ గౌడ్ స్పందిస్తూ, బిల్డర్ల తప్పిదాలకు కొనుగోలుదారులు బలికాకుండా ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. బఫర్ జోన్ పరిధిలోని ఫ్లాట్ యజమానులకు వేరే గెటెడ్ కమ్యూనిటీలో సమాన విస్తీర్ణమున్న ఫ్లాట్లను ఇవ్వడం లేదా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చేయిస్తాం అన్నారు.

February 24, 2026 / 04:12 PM IST

‘ఐదు రోజుల్లోనే అకౌంట్‌లోకి నగదు..!’

E.G: గోకవరం మండలంలోని కొత్తపల్లి, బొమ్మల దొడ్డి హౌసింగ్ లేఅవుట్లను జిల్లా హౌసింగ్ పీడీ నాది బుజ్జి మంగళవారం సందర్శించారు. రూఫ్ లెవల్‌లో ఆరు, బేస్‌మెంట్ లెవల్‌లో 102 ఇళ్లు ఉన్నట్లు పీడీ తెలిపారు. నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని లబ్ధిదారులను కోరారు. బిల్లులు సకాలంలో అప్‌లోడ్ చేస్తే ఐదు రోజుల్లోనే నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

February 24, 2026 / 04:10 PM IST

కలెక్టరేట్‌లో ఆకస్మిక తనిఖీలు

ఆసిఫాబాద్ కలెక్టరేట్ భవనంలోని ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ హరిత అకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి సమయపాలనపై అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు విధులకు సమయానికి హాజరవుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

February 24, 2026 / 04:10 PM IST

చరణ్‌ భక్తిని అనుమానించకండి: అల్లు శిరీష్

దుబాయ్ వేదికగా అల్లు శిరీష్ ఇచ్చిన పార్టీకి రామ్ చరణ్ అయ్యప్ప మాలలో హాజరవ్వడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీనిపై శిరీష్ స్పందిస్తూ.. ‘చరణ్ పార్టీ మొదలవ్వక ముందే వచ్చి, మమ్మల్ని ఆశీర్వదించి వెంటనే వెళ్లిపోయారు. అక్కడ మద్యం లేదు, అపచారం జరగలేదు. ఆయన భక్తిని ఎవరూ వేలెత్తి చూపలేరు’ అని ఘాటుగా బదులిచ్చాడు. విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికాడు.

February 24, 2026 / 04:10 PM IST

ఘనంగా తలుపులమ్మ తల్లి పండుగ

AKP: గొలుగొండ(మం) నర్సింగబిల్లిలో తలుపులమ్మ తల్లి పండుగను మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పెద్దలు తెలిపారు.

February 24, 2026 / 04:07 PM IST

డొంక రోడ్డులో పార్కు ఏర్పాటుకు మున్సిపల్ కమిషనర్ కసరత్తు

GNTR: గుంటూరు డొంక రోడ్డులోని వల్లూరివారితోట, కార్మిక శాఖకు చెందిన ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటు చేసే అంశాన్ని మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ మంగళవారం పరిశీలించారు. తమ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పార్కు నిర్మించాలని స్థానికులు ఆయనకు విన్నవించారు. అనంతరం, అస్తవ్యస్తంగా ఉన్న 5వ లైన్‌ను కూడా కమిషనర్ స్వయంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.

February 24, 2026 / 04:05 PM IST

తెలంగాణ ఉప ముఖ్యమంత్రిని కలిసిన సీతారాం

W.G: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లను పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంకెం సీతారాం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో జరుగుతున్న ఏఐసీసీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా ఇరువురు నేతలకు జ్ఞాపికలను అందజేశారు.

February 24, 2026 / 04:05 PM IST

బాల్క సుమన్‌కు జైలు కొత్త కాదు: కేటీఆర్

ADB: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు జైలులో ఉండటం కొత్తేమీ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న బాల్క సుమన్‌తో ములాఖత్ అయ్యాక కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో సుమన్ ఎన్నో సార్లు జైలుకు వెళ్లి వచ్చారన్నారు. జైలులో పెడితే సుమన్ భయపడతారని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే పొరపాటేనన్నారు.

February 24, 2026 / 04:04 PM IST