• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అమ్మవారి పునః ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: మెలియాపుట్టి (M) గాథలవలస గ్రామంలో శ్రీ సవర పోలమ్మ అమ్మవారి ఆలయ పునః ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతల ఆశీస్సులు ఉంటే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది అని అన్నారు.

February 22, 2026 / 12:39 PM IST

అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఆదివారం గ్రామపంచాయతీ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఆర్‌వో కుద్బుద్దిన్ మాట్లాడుతూ.. అడవుల పరిరక్షణకై ప్రతి ఒక్కరు సహకరించాలని, అడవిలో అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే సమాచారం అందించాలని గ్రామస్తులకు సూచించారు.

February 22, 2026 / 12:38 PM IST

ఇది ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట: శ్రీ వర్ధన్ రెడ్డి

RR: బాన్సువాడ హింసలో గాయపడిన బాదిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావును అడ్డుకుని నిర్బంధించడం ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట అని SDNR BJP నేత శ్రీవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. అసలు దుండగులను వదిలిపెట్టి బాధితుల పక్షాన నిలిచిన నాయకుడిని అరెస్టు చేయడం అధికార దుర్వినియోగానికి ఉదాహరణ అన్నారు.

February 22, 2026 / 12:38 PM IST

భూమి పూజలో పాల్గొన్న మంత్రి

CTR: చిత్తూరులో టీడీపీ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజా కార్యక్రమాలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్ హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సమన్వయానికి కార్యాలయం కేంద్ర బిందువుగా నిలుస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

February 22, 2026 / 12:37 PM IST

‘అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు వేగవంతం కావాలి’

PDPL: రామగుండం కార్పొరేషన్ డివిజన్లలో కనీస సౌకర్యాలు కల్పించి, అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టాలని CPI నాయకులు కనకరాజు, కార్పొరేటర్ మార్కాపురి సూర్య మేయర్ మహంకాళి స్వామిని ఆదివారం కలిసారు. మార్కండేయ కాలనీలో సమస్యలపై చర్చించి, పనులను తక్షణమే అమలు చేయమని కోరారు. గోశిక మోహన్, గౌతం గోవర్ధన్, తాళ్లపల్లి మల్లయ్య, శంకర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

February 22, 2026 / 12:36 PM IST

‘డంపింగ్ యార్డ్‌గా మారిన 14వ వార్డు’

WNP: పట్టణంలోని 14వ వార్డు అధ్వాన్నంగా తయారైంది. స్థానిక బ్రహ్మంగారి ఆలయం వెనుక భాగం ప్రస్తుతం చెత్తాచెదారంతో నిండి, ఒక మినీ డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో హడావుడి చేసిన అధికారులు, ఆ తర్వాత అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వార్డు ప్రజలు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

February 22, 2026 / 12:36 PM IST

రెండుసార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నా: రవి బస్రూర్

విశ్వక్ సేన్ ‘కల్ట్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు రవి బస్రూర్ తన గతాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. 18 ఏళ్ల వయసులో ఆర్థిక కష్టాల వల్ల రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని తెలిపాడు . ఆ సమయంలో రవి అనే వ్యక్తి తనను రక్షించి, కీబోర్డుతో పాటు రూ.35 వేలు ఇచ్చి ఆదుకున్నారని, అందుకే ఆయనపై కృతజ్ఞతతో తన పేరులో ‘రవి’ని చేర్చుకున్నానని వెల్లడించాడు.

February 22, 2026 / 12:36 PM IST

ఘనంగా టీడీపీ నూతన జిల్లా కార్యాలయ భూమిపూజ

కడప జిల్లా TDP పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి ఆదివారం ఘనంగా భూమిపూజ జరిగింది. జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకలో జిల్లా టీడీపీ నాయకులు, నగర కమిటీ సభ్యులు, క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్‌చార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 12:35 PM IST

చిత్తూరు జిల్లాలో కార్డెన్ అండ్ సెర్చ్

CTR: ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. నేరాలు, అక్రమ రవాణా నియంత్రణ లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో 10 ద్విచక్ర వాహనాలు, 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

February 22, 2026 / 12:33 PM IST

‘ఇళ్లకు కాంక్రీట్ రూఫ్ కోసం ప్రత్యేక ఆర్థిక సహాయం కావాలి’

VKB: బండల ఇళ్ల కారణంగా గృహలక్ష్మీ లబ్ధిదారులు అయినప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ పథకానికి అర్హత పొందలేకపోతున్నారని కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ అన్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి కాంక్రీట్ రూఫ్ నిర్మాణం కోసం రూ. 2 లక్షలు మంజూరు చేసేలా స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ చొరవ తీసుకోవాలని కోరారు. విద్యుత్ సమస్యలకు కూడా ఉపశమనం సాధించవచ్చని అన్నారు.

February 22, 2026 / 12:33 PM IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి కలెక్టర్ నివాళులు

TPT: కలెక్టరేట్‌లో ఆదివారం స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన చిత్రపటానికి కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో DR&O జి.నరసింహులు, ఆధికారులు పాల్గొన్నారు.

February 22, 2026 / 12:33 PM IST

SLBC ఘటన.. దొరకని ఆరుగురి ఆచూకీ

NGKL: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.

February 22, 2026 / 12:33 PM IST

‘ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుంది’

SRPT: పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే మా ప్రజా ప్రభుత్వ ద్వేయమని ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట మండలం కాసరబాధ గ్రామంలో దూడిగ రాములు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట నెరవేర్చి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని తెలియజేశారు.

February 22, 2026 / 12:32 PM IST

కందుల నాగరాజు ఆర్థిక సాయం

VSP: విశాఖలోని 32వ వార్డు నేరెళ్ల కోనేరు ప్రాంతానికి చెందిన పెద్దిలమ్మ మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు, కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టాల్లో ఉన్న వారికి ఎల్లప్పుడూ ఒక కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటానన్నారు.

February 22, 2026 / 12:30 PM IST

ప్రజల ఆనందం- ఆరోగ్యం లక్ష్యం: మంత్రి

కోనసీమ: విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి వారికి ఆనందం, సంతోషం అందించే లక్ష్యంతో ‘హ్యాపీ సండే’ నిర్వహిస్తున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఆదివారం రామచంద్రపురం చింతపల్లి సూరన్న నగర్‌లోని బాలికల హైస్కూల్లో జరిగిన హ్యాపీ సండే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మానసిక ప్రశాంతత కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

February 22, 2026 / 12:30 PM IST