CTR: తవణంపల్లిలోని జొన్నగురకలలో కాలనీవాసులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో సరైన నీటి సరఫరా లేకపోవడంతో మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ రామరాజు ఆధ్వర్యంలో కాలనీవాసులు డిప్యూటీ ఎంపీడీవో రాజశేఖర్‌కు వినతి పత్రం అందించారు. వెంటనే తాగునీటి సరఫరా మెరుగుపరచాలని ఎంపీడీవో సంబంధిత అధికారులను ఆదేశించారు.
సత్యసాయి: పుట్టపర్తి పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురాన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాధితుల నుంచి 96 ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడిన అడిషనల్ ఎస్పీ, సమస్యలపై తక్షణమే విచారణ జరిపి న్యాయం చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.
హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తపై జరిగిన దాడి ఘటనపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సోమవారం సీపీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, పీడీ యాక్ట్ నమోదు చేసి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
WGL: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు, డిజైనర్లకు రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోందని WGL జిల్లా చేనేత & జోలి శాఖ సహాయ సంచాలకులు వై. శ్రీకాంత్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు పర్యటిస్తున్నట్లు మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారన్నారు. పర్యటనలో భాగంగా జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులను పరామర్శించనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనన్నారు.
E.G: PGRS, రెవెన్యూ క్లినిక్ అర్జీలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో పరిష్కరించాలని RDO ఆర్. కృష్ణ నాయక్ ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన 14 అర్జీలను స్వీకరించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా అందిన ప్రతి ఫిర్యాదును నూరు శాతం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
GNTR: వీధి కుక్కల నియంత్రణకు గాను ఏర్పాటు చేస్తున్న యాంటీ బర్త్ కంట్రోల్ (ABC), యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ సెంటర్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. సోమవారం పొన్నూరు రోడ్డులోని ఏబీసీ సెంటర్, సుద్దపల్లి డొంకలోని ఎస్టీపీ ప్లాంట్‌ను ఆయన స్వయంగా పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
NZB: ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ‘4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026’లో జిల్లాకు చెందిన పోలీస్ సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన సిబ్బందిని సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ (సీపీ) సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించారు.
ప్రకాశం: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే లక్ష్యంగా సోమవారం ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు వివరించారు. ప్రతి ఫిర్యాదుదారుతో అధికారులు ముఖాముఖీగా మాట్లాడి వారి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. మీకోసం కార్యక్రమంకు 75 ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు.
SKLM: ఇచ్చాపురం ఎంఈవో అప్పారావు ఏసీబీ వలలో చిక్కారు. రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ ఫైల్ క్లియర్ చేయడానికి రూ.30,000 డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముందస్తు సమాచారంతో రూ.10,000 లంచం స్వీకరిస్తుండగా ఎంఈవోను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ సోమవారం తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
GDWL: కేటిదొడ్డి మండల నూతన తహసీల్దార్ కరుణాకర్‌ను ఎంఆర్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా సన్మానించారు. మండలంలో పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత సమస్యలు, భూభారతి పనులను త్వరగా పరిష్కరించాలని కోరారు. స్పందించిన తహసీల్దార్, ప్రతి సమస్యను పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
HNK: JNS స్టేడియంలో CM కప్ ముగింపు కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని క్రీడాకారులకు బహుమతి ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి క్రీడాకారులను గుర్తించి జాతీయ స్థాయికి పంపించేందుకు సీఎం CUP ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, అధికారులు పాల్గొన్నారు.
NGKL: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయంతో కలిసి 50 అర్జీలను స్వీకరించారు. అందిన దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
RR: విద్యార్థులు ఫీజులు చెల్లించకపోయిన కచ్చితంగా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వాలని AISF రంగారెడ్డి జిల్లా సహాయకార్యదర్శి శివకుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలు ఫీజులు కట్టలేదని సాకుతో ఈ పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచొద్దని, హాల్ టికెట్స్ జారీ చేయాలన్నారు.
కోనసీమ: కపీలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన పలువురు సోమవారం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి లీలాకృష్ణ జనసేన కండువాను కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అంకితభావంతో పనిచేసి మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలపరచేందుకు కృషి చేయాలని సూచించారు