VSP: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతీ నెల మూడవ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ‘జీరో–వేస్ట్ లిట్టర్ గవర్నెన్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 9 గంటల నుంచి కార్యాలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు.
AP: టెక్నాలజీ వినియోగంలో దేశంలో ఏపీనే నెంబర్ వన్ అని సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవసాయంలోనూ AI సేవలు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా చేస్తామన్నారు. స్త్రీశక్తి, దీపం పథకం అమలు చేస్తున్నామని వెల్లడించారు. పేదల ఆదాయం పెంచేందుకు పీ4 పథకం తీసుకువస్తున్నామని చెప్పారు.
T20 ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కళ్లు చెదిరే రికార్డును నెలకొల్పింది. జియోస్టార్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కేవలం ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌లోనే ఏకంగా 163 మిలియన్ల (16.3 కోట్లు) వ్యూస్ నమోదయ్యాయి. ఇది 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కంటే కూడా అత్యధికం. దీంతో ఈ మ్యాచ్ బ్రాడ్‌కాస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.
మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. 2026 సమ్మర్ రిలీజ్ అని చిరు స్వయంగా చెప్పినా, భారీ VFX పనుల వల్ల జాప్యం జరుగుతోంది. మరోవైపు ఆలస్యంగా మొదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే విడుదలై రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. దీంతో పెండింగ్‌లో ఉన్న ‘విశ్వంభర’ ఓటీటీ డీల్, విడుదల తేదీపై మెగా ఫ్యాన్స్ ఆందోళన చెంద...
PDPL: ధర్మారం మండలం ఖానంపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో శనివారం చిన్నారులు, గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారం, కోడిగుడ్లు, బలామృతం పంపిణీని పరిశీలించారు. సర్పంచ్ కాల్వ సుగుణ–మల్లయ్య, ఉపసర్పంచ్ బెజ్జెంకి యమున–రాజేందర్ సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సతీష్, వార్డు సభ్యులు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
TG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు స్వామి వారిని ముస్తాబు చేసే పర్వంలో వటపత్ర శయన అలంకృతుడిగా తీర్చిదిద్దారు. అనంతరం మాడవీధులలో తీర్థజనుల దర్శనార్థం స్వామివారిని ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య దర్శనం పొందారు.
WGL: రసాయన ఎరువులను తగు మోతాదులోనే వాడాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రైతులకు సూచించారు. నల్లబెల్లి మండల కేంద్రంలోని కొండయిలపల్లి గ్రామంలో మిర్చి రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అధిక రసాయనులు వాడడం వలన పంట దిగుబడి సరిగ్గా రాదని పేర్కొన్నారు. రైతులు రసాయన ఎరువులు తగ్గించాలని కోరారు.
జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి తాళ్లపల్లి నరసింహులు వేరికోసిల్ (కాళ్ల నరాల) సంబంధిత వ్యాధితో బాధ పడుతూ అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా విషయాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వారు రూ.2 లక్షల LOCని మంజూరు చేయించి, నేడు అందజేశారు.
కామారెడ్డి: జిల్లా నుంచి 11 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి యోగాసనా పోటీలకు ఎంపికయ్యారని జిల్లా యువజన స్పోర్ట్స్ అధికారి శ్రీరంగ వేంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. ఈ యోగాసనా పోటీలు నేటి నుంచి 23 వరకు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్నాయని తెలిపారు. కామారెడ్డి జిల్లాకు స్వర్ణ, రజక పతకాలు తీసుకురావాలని ఆయన కోరారు.
AP: పల్నాడు అంటే పౌరుషాల గడ్డ అని సీఎం చంద్రబాబు తెలిపారు. పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయని అన్నారు. శివరాత్రి అంటే కోటప్పకొండ ప్రభలు ప్రత్యేకమన్నారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురాబోతోందని చెప్పారు. సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అని వెల్లడించారు. తాను సీఎం అయ్యే నాటికి 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని పేర్కొన్నారు.
E.G: కొవ్వూరులో శనివారం జరిగిన ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించి స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్: దేవుడు చిత్రపటాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటం అత్యంత దుర్మార్గమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మండిపడ్డారు. ఈ సందర్భంగా విజయవాడ గురునానక్ కాలనీ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
TG: చంచల్‌గూడ జైల్లో ఇటీవల నిర్వహించిన ములాఖత్‌లో పేలుళ్లకు ప్లాన్ రచించినట్లుగా నిఘావర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు వస్తున్న వార్తలను జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా ఖండించారు. ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజంలేదని, అదంతా అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ అసత్య వార్తలను కొన్ని ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
HYD: చంచల్‌గూడ జైలు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ HYDలో ఉగ్ర కుట్రకు మాస్టర్ మైండ్ వ్యవహరించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. జైలు నిబంధనల ప్రకారం లభించే ‘ములాకత్’ సమయాన్ని ఉపయోగించుకుని, బయట ఉన్న తన అనుచరులకు రహస్యంగా ఆదేశాలు పంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులు ముగ్గురు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
MDK: చేగుంట మండలంల వడియారం ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మాతృభాషలో చదువుకున్నప్పుడే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడం సులువు అవుతుందని, మాతృభాష పట్ల ప్రతి ఒక్కరు మమకారం పెంచుకోవాలని పాఠశాల హెచ్ఎం సిద్ధిరాములు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.