• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘కాంగ్రెస్ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు’

KNR: కాంగ్రెస్ నేతలు వీధి రౌడీల్ల ప్రవర్తిస్తున్నారని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు.

February 23, 2026 / 07:20 AM IST

అనూరియా కేసులు.. మంత్రి కందుల కీలక సూచనలు

AP: రాజమహేంద్రవరం అనూరియా కేసులపై ప్రజలకు మంత్రి కందుల దుర్గేష్ కీలక సూచనలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్, వైద్యశాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

February 23, 2026 / 07:19 AM IST

జిల్లాకు మరో స్వర్ణం.. సీఎం కప్‌లో అభిషేక్ గౌడ్ సత్తా

KMM: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 సీఎం కప్ క్రీడల పోటీలలో ఖమ్మం జిల్లాకు చెందిన పెద్దమునగాల గ్రామానికి చెందిన అభిషేక్ గౌడ్, ఊషు క్రీడలో సబ్ జూనియర్ 48 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకాన్ని సాధించారు. జాతీయ కోచ్ పరిపూర్ణ చారి వద్ద శిక్షణ పొందుతున్న 8వ తరగతి విద్యార్థి అయిన అభిషేక్ గౌడ్‌ను పాఠశాల యాజమాన్యం అభినందించింది.

February 23, 2026 / 07:18 AM IST

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

BPT: చెరుకుపల్లి మండలం కావూరు హైస్కూల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జొన్నలగడ్డవారిపాలెం గ్రామానికి చెందిన మొవ్వ ముత్యాలరావు (46) దుర్మరణం చెందారు. రాంబట్లపాలెం నుంచి ఎరువుల బస్తాలతో బైకుపై ఇంటికి వస్తుండగా, గుర్తుతెలియని కారు ఆయనను బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ముత్యాలరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 07:18 AM IST

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు విద్యార్థుల ఎంపిక

SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. మహబూబ్ నగర్‌లో జరుగుతున్న నెట్ బాల్ పోటీలకు అక్షయ్, ధనుష్, సంజయ్, జగదీశ్ ఎంపికైనట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. అలాగే వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో 800 మీటర్ల పరుగు పందెంలో వినయ్ కుమార్, దీపక్ పాల్గొననున్నారు.

February 23, 2026 / 07:18 AM IST

దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

KDP: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లిని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ఆమె భర్త, టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ కమిటీ సభ్యులు వీరికి ఆహ్వానం పలికి దర్శనం చేయించారు.

February 23, 2026 / 07:18 AM IST

రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు

MNCL: హైదరాబాద్‌లో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో మంచిర్యాల జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-25 విభాగంలో రాహుల్ బంగారు పతకం, శ్రీజ కాంస్య పతకం సాధించగా, అండర్-14 విభాగంలో చైత్ర కాంస్య పతకం గెలుచుకుంది. విజేతలను DYSO హనుమంత్ రెడ్డి, యోగాసన సంఘం నేతలు అభినందించారు. జిల్లా పేరు నిలబెట్టినందుకు హర్షం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 07:16 AM IST

అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు పట్టివేత

JGL: మల్యాల మండలం రాంపూర్ గ్రామశివారులోని ఐకేపీ సెంటర్ సమీపంలో వరద కాలువ వద్ద అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై నరేశ్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగామట్టిని నింపుతున్న 3 టిప్పర్లు, ఓ జేసీబీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

February 23, 2026 / 07:15 AM IST

నేడు ఆళ్లపల్లిలో ఎమ్మెల్యే పర్యటన

BDK: ఆళ్లపల్లి మండలంలో ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటిస్తారని మండల తహసీల్దార్ ప్రకటించారు. మండలానికి చెందిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తారని అన్నారు. అలాగే పలు శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అధికారులు సకాలంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

February 23, 2026 / 07:12 AM IST

శ్రీకాళహస్తికి చాగంటి కోటేశ్వరరావు రాక

TPT: శ్రీకాళహస్తికి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇవాళ రానున్నారు. గోపురం వద్దగల ధూర్జటి కళా ప్రాంగణంలో ఆయన ప్రవచనం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు భక్తులకు ఆత్మశాంతి అందిస్తాయన్నారు.

February 23, 2026 / 07:12 AM IST

వార్డు సభ్యులకు రైతు వేదికలో ఐదు రోజులు అవగాహన శిక్షణ

PDPL: రామగిరి మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు రత్నాపూర్ రైతు వేదికలో 5 రోజుల సాధారణ అవగాహన శిక్షణ నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయని, మొత్తం 148 మంది సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీడీవో బి. శైలజారాణి ఆదేశించారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులు సభ్యుల హాజరు కావాలన్నారు.

February 23, 2026 / 07:12 AM IST

‘బహుజన ధీరుడు.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్’

MHBD: నెల్లికుదురు మండలంలోని వావిలాల గ్రామంలో ఆదివారం గౌడ సంఘం అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు రమణ పాల్గొని మాట్లాడుతూ.. నాటి పాలకుల అరాచకాలను అణచివేసేందుకు పుట్టిన బహుజన ధీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.

February 23, 2026 / 07:12 AM IST

పలువురికి కిడ్నీ వ్యాధి.. అధికారులు అప్రమత్తం

AP: రాజమహేంద్రవరం ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. సంఘటన జరిగిన ప్రాంతాల్లో పాలు, నీరు, ఇతర నమూనాలను సేకరించారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా రాజమహేంద్రవరంలో పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే.

February 23, 2026 / 07:11 AM IST

BREAKING: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం

TG: రాష్ట్రంలో వరుసగా బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్ వద్ద బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. షాంపూర్ బ్రిడ్జి వద్ద బస్సు అదుపుతప్పి వాగులో పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉట్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 07:11 AM IST

ఇంటర్ విద్యార్థుల కోసం బాప్టిస్ట్ చర్చిలోప్రత్యేక ప్రార్థనలు

SRPT: ఇంటర్మీడియట్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల విజయాల కోసం కోదాడ పట్టణంలోని నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం రాత్రి పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పరీక్షలు రాయబోయే విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకంగా ఆశీర్వదించి, వారి భవిష్యత్తు శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.

February 23, 2026 / 07:11 AM IST