SRPT: అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారి ప్రాణాలను కాపాడడంలో సీపీఆర్ (CPR) కీలకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. శనివారం ఐడీఓసీలో తొమ్మిది ఆర్బీఎస్‌కే బృందాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిమిషానికి 100-120 సార్లు ఛాతీపై ఒత్తిడి కలిగించడం ద్వారా రక్త ప్రసరణను పునరుద్ధరించవచ్చని ఆయన వివరించారు.
NLG: చండూరు పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో రేపటి నుంచి శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పూజా కార్యక్రమాలు, ధ్వజారోహణ నిర్వహించనున్నారు. అనంతరం 50 జతల ఎద్దుల శకటంపై చేనేత మగ్గంతో పట్టు వస్త్రాల నేసే కార్యక్రమం, ఊరేగింపు జరుగనున్నాయి.
BHPL: రేగొండ(M) కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. MLA గండ్ర సత్యనారాయణ రావు ఆహ్వానం మేరకు గోరికొత్తపల్లి మండల నాయకులు హాజరై అన్నదానం వడ్డించి సహకరించారు. ఈ కార్యక్రమంలో మండల ఇంఛార్జ్ ఓం ప్రకాష్, NSUI మండల అధ్యక్షుడు రంజిత్, మాజీ వార్డు మెంబర్ కుమార్, నాలుగో వార్డు మెంబర్ అనిల్ పాల్గొన్నారు.
SKLM: ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు యూజీ పరీక్షల విభాగం డీన్ ఎం. అనురాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీబీ, సీఏ. బీబీఏ, బీటెక్ పరీక్షలు సంబంధించి రిజల్ట్ యూనివర్సిటీ నోటీస్ బోర్డులు ఏర్పాటు చేస్తామని, వర్సిటీ వెబ్‌సైట్ ఫలితాలను విద్యార్థులు చూడవచ్చని తెలిపారు.
TG: మేడ్చల్ జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కామారెడ్డి పర్యటనకు వెళ్లకుండా ఈటలను అడ్డుకున్నారు. ఏసీపీతో సహా ఈటల రాజేందర్ నివాసం వద్ద పోలీసులు మోహరించారు. కాగా, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిమీద దాడి నేపథ్యంలో.. పరామర్శకు వెళ్లేందుకు ఈటల సిద్ధమయ్యారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశాలున్నాయని ఈటలను అడ్డుకున్నారు.
‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘కిల్లర్’. ఈ సినిమాతో ఆమె వెండితెరపై హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తాజాగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. Sci-Fi థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జ్యోతి ఐదు పాత్రలలో నటిస్తుండటం విశేషం.
MDK: హవేలీ ఘనపూర్ మండలం ఫరీద్ పూర్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై మండల వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలని అధికంగా ఎరువులు పురుగు మందులు వాడడం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. భూమి సారం తగ్గుతుందని తద్వారా పంట దిగుబడులు తగ్గుతున్నాయని అన్నారు.
ప్రకాశం: కనిగిరి డీఎస్పీ ఆదేశాల మేరకు, పొదిలి పట్టణంలోని చిన్నచెరువు ప్రాంతంలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డులు లేని 3 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకాశం: కనిగిరి డీఎస్పీ ఆదేశాల మేరకు, పొదిలి పట్టణంలోని చిన్నచెరువు ప్రాంతంలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డులు లేని 3 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
JGL: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో శనివారం వ్యవసాయ అధికారి రాజకుమార్ ఆధ్వర్యంలో రసాయన ఎరువుల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పంటలకు సరైన ఎరువులు, పంట మార్పిడి ప్రాముఖ్యతను ఆయన రైతులకు వివరించారు. అలాగే వారు వేసిన పంటలకు ఏ సమయంలో ఎంత మోతాదులో రసాయనాలు వాడాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో, సర్పంచ్, ఉపసర్పంచ్, రైతులు పాల్గొన్నారు.
TG: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయిలో విద్య, వైద్యం, విద్యుత్ సరఫరా, వ్యవసాయం, ఆర్టీసీ బస్సుల సౌకర్యం వంటి మౌలిక వసతులపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
MDCL: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటిమీద దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు కామారెడ్డి బయలుదేరిన ఈటల రాజేందర్‌ను అడ్డుకున్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వైఖరిని, పాలీసుల తీరును తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్, గుండాయిజం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
CTR: నగరి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమం ఆదివారం ఉదయం 10.26 గంటలకు చిత్తూరు బస్టాండ్ సమీపంలో నిర్వహించనున్నట్లు నగరి ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటించింది. కార్యక్రమానికి MLA భానుప్రకాష్ హాజరుకానున్నారు. నగరి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
RR: కొందుర్గు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. రాబోవు మూడు సంవత్సరాల్లో మండలం రూపురేఖలు మారబోతున్నాయని, మండల కేంద్రంలో రూ. 15 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొందుర్గు మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు.