SKLM: పలాస కాశీబుగ్గ పట్టణంలో సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురి వ్యక్తులు పట్టుబడినట్లు సీఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
TPT: అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల మాపింగ్ శాతాన్ని పెంచాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ఎన్.మార్య సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. 2025 జాబితాను 2002 జాబితాతో సరిపోల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా దర్యాప్తు చేయాలని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులపై దాడులు ఒక ఫ్యాషన్‌లా మారిపోవడం అత్యంత ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.
ATP: పామిడి మండలంలోని ఓ తండాకు చెందిన సెటానాయక్ అనే వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మూడవ తరగతి చదువుతున్న చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
NRPT: ఈ నెల 25వ తేదీ నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని PDSU నాయకుడు శ్రీహరి యాదవ్ కోరారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిచూసుకోవాలని, సెంటర్లలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎం ఉండాలని, పరీక్ష సమయానికి అనుకూలంగా RTC బస్సులను నడిపించాలని కోరారు.
సూర్యాపేట జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.200 నుంచి రూ. 250 మధ్య ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.260 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. గత వారాలతో పోలిస్తే ఇది రూ.10–15 వరకు పెరిగింది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చుని స్థానికులు తెలుపారు.
NRML: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కుబీర్ SI కృష్ణారెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని సిర్పెల్లి రహదారిపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.
ELR: బుట్టాయిగూడెం మండలం నందాపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి దాటుతున్న పాయల సుబ్బారావు (60) అనే వ్యక్తిని వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న కారు వేగంతో వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో సుబ్బారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ADB: తాంసి మండల గ్రామాలలో ఆదివారం ఎలాంటి కరెంటు అంతరాయం ఉండదని తాంసి విద్యుత్ శాఖ AE మనోజ్ పేర్కొన్నారు. మండలంలోని చాలా గ్రామాలలో శుభకార్యాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని గ్రామాల ప్రజా ప్రతినిధులు కరెంట్ నిలిపివేయ వద్దని కోరగా.. సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పనిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
VZM: ప్రఖ్యాత హోటళ్ల పేర్లతో నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించి ఈ బుకింగ్స్ పేరుతో మోసం చేస్తున్న ముఠా ప్రధాన నిందితుడిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన యతేంద్ర జటావ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మోసం వెలుగులోకి వచ్చింది. అతని వద్ద నుంచి కంప్యూటర్లు, సాంకేతిక పరికరాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
SRCL: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే నిలిచిపోయిన మానాల-మర్రిమడ్ల బీటీ రోడ్డు పనులు తిరిగి ప్రారంభమయ్యాయని పార్టీ మండల అధ్యక్షుడు తూమ్ జలపతి అన్నారు. మండలంలోని మానాల-మరిమడ్ల రోడ్లు పనులు ఇటీవల ప్రారంభం కాగా శనివారం వీరునితండా గ్రామ సమీపంలో బీటీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు.
AP: మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, పనుల పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు.
ADB: బోథ్ మండలంలోని సాంగ్వి గ్రామపంచాయతీ రాంనగర్ గ్రామంలో తగిరే ప్రదీప్ ఇటీవల విడుదలైన స్టాఫ్ సెలక్షన్ ఫలితాల్లో CRPF ఉద్యోగం సాధించాడు. తన కుమారుడి విజయం పట్ల తండ్రి కర్తర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సుందర్ సింగ్ యువజన సంఘాల నాయకులతో కలిసి ఆయన్ను శాలువాతో సత్కరించి అభినందించారు.
VZM: ఆంద్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF ) రాష్ట్ర అకడమిక్ కౌన్సిలర్‌గా బొబ్బిలికి చెందిన జె.సి.రాజు రెండవసారి ఎన్నికయ్యారు.ఈ మేరకు శనివారం ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల తెలియజేశారు. ఈ సందర్భంగా జేసీ రాజు మాట్లాడుతూ.. సంఘ నిర్మాణానికి, అభివృద్ధికి, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
అన్నమయ్య: రంజాన్ మాసం సందర్భంగా రాయచోటిలో మాంసం ధరలు పెరిగాయి. చికెన్ కిలో ధర రూ. 210 నుంచి రూ. 240కి చేరగా, మటన్ ధర కిలోకు రూ. 800గా కొనసాగుతోంది. చేపల ధరలు రూ. 100 నుంచి 300 మధ్య ఉన్నాయి. ఆదివారం కావడంతో చికెన్ దుకాణాల వద్ద కొనుగోలుదారుల రద్దీ భారీగా కనిపించింది. ధరలు పెరిగినా వినియోగదారుల రద్దీ తగ్గలేదు. వ్యాపారులు డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు.