• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

NZB: కమ్మర్‌పల్లి మండలంలోని కేసీఆర్ కాలనీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రోళ్ల లస్మయ్య (75) మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. లస్మయ్య ఎకైల్పై కమ్మర్ పల్లి నుంచి వెళ్తుండగా జాతీయ రహదారి-63పై అతని వాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లస్మయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఎస్సై అనిల్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 06:40 PM IST

IND vs SA: ప్లేయింగ్-11

IND: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తిSA: మార్‌క్రమ్(c), డికాక్(w), రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, మార్కో యాన్‌సన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, రబాడ, లుంగి ఎన్గీడి

February 22, 2026 / 06:38 PM IST

కుమ్మెర జాతరలో చిన్నారి మృతి.. సీపీఎం ఆగ్రహం

TG: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో దైవదర్శనానికి వెళ్లిన రెండేళ్ల దళిత చిన్నారి అనుమానాస్పద మృతిపై సీపీఎం తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ స్పందించారు. చిన్నారి మృతి అత్యంత విషాదకరమని… చిన్నారి మృతిపట్ల సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తోందన్నారు. CM రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకుని.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

February 22, 2026 / 06:38 PM IST

‘రేపటి నుంచి యధావిధిగా ప్రజావాణి’

JGL: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి తిరిగి యథాతథంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

February 22, 2026 / 06:37 PM IST

విద్యార్థులకు విద్యాసామగ్రిని అందజేత

ELR: విద్యాభివృద్ధికి నా వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని రెవరెండ్ డి.చెల్లప్ప సుమా అన్నారు. ఆదివారం ఉంగుటూరులో యెహోవా యీరే మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా పదో తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్యాడ్, స్కేల్స్ పెన్నలు అందజేశారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు అందజేస్తున్న చెల్లప్ప సుమను పలువు అభినందించారు.

February 22, 2026 / 06:35 PM IST

నూతన ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్‌లకు సన్మానం

NLG: చిట్యాల మున్సిపల్ చైర్మన్‌గా పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్‌గా గుండెబోయిన శ్రీలక్ష్మి ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ జిట్ట నగేష్, సీపీఎం జిల్లా నేత అవిశెట్టి శంకరయ్య వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు సుధాకర్ రెడ్డి, రాజయ్య, యాదయ్య, అర్జున్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:35 PM IST

‘మెరుగైన ఫలితాల లక్ష్యంగా ప్రత్యేక తరగతులు’

ASF: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 25 నుంచి మార్చి 16 వరకు జరగనున్నాయి. జిల్లా గతంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో ఈసారి కూడా మెరుగైన ఫలితాల లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు DIEO రాందాస్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పూర్తి సన్నద్ధతతో పరీక్షలకు హాజరవుతున్నారని పేర్కొన్నారు.

February 22, 2026 / 06:33 PM IST

రేపటి రైతు సభకు కవిత రాక

గద్వాల పట్టణంలోని అనంత ఫంక్షన్ హాల్లో సోమవారం ‘రైతు సంఘర్షణ సభ’ జరగనుంది. ఈ సభకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలపై చర్చించనున్నారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని జిల్లా ఛైర్మన్ రంజిత్ కుమార్ కోరారు.

February 22, 2026 / 06:33 PM IST

ఎల్లమ్మ ఆలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు

SRCL: కోనరావుపేట (M) బావుసాయిపేట గ్రామంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ భద్రత కోసం ఆదివారం ఉపసర్పంచ్ తిక్కల నవీన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గౌడ కుల పెద్దల సమక్షంలో వీటిని ప్రారంభించి, ఆలయానికి అప్పగించారు. భక్తుల భద్రతను పర్యవేక్షించడంతో పాటు ఆలయ పరిసరాలను సురక్షితంగా ఉంచడమే దీని ముఖ్య ఉద్దేశమని నవీన్ తెలిపారు.

February 22, 2026 / 06:33 PM IST

ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఇమ్రాన్ అలీ

కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఉప సర్పంచ్‌ల ఫోరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫోరం అధ్యక్షుడిగా మీర్ ఇమ్రాన్ అలీ, ఉపాధ్యక్షుడిగా వెంక గౌడ్, జనరల్ సెక్రటరీగా కోశాధికారిగా వెంకట్ ఎన్నికయ్యారు. సలహాదారులుగా షామయ్య, బలరాంలను ఎంపిక చేశారు.

February 22, 2026 / 06:32 PM IST

వీధి కుక్కల దాడిలో పలు పశువులు మృతి

ADB: బోథ్ మండలంలోని కూచులాపూర్ గ్రామంలో వీధి కుక్కల బీభత్సంతో పలు పశువుల మృత్యు బారిన పడుతున్నాయి. ఆదివారం గ్రామంలోని లస్మన్నకు చెందిన ఆవు దూడపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. అంతకు ముందు పలు మేకలు కుక్కల బారిన పడ్డాయి.

February 22, 2026 / 06:32 PM IST

ఆలయ నిర్మాణానికి భారీ విరాళం అందజేత

SRD: ప్రతి ఒక్కరికి దైవచింతన ఉండాలని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ తాబేలు గుట్టలో నూతన శ్రీ జీవన జ్యోతిర్లింగ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గుమ్మడిదల బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధికి రూ.1,51,000 విరాళం అందజేశారు. దైవానుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు.

February 22, 2026 / 06:32 PM IST

‘మానవ అక్రమ రవాణాను అరికట్టాలని ప్రతిజ్ఞ’

WG: పాలకోడేరు(M) విస్సాకోడేరులోని ఓ చర్చిలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం జరిగింది. ఆ సంస్థ సభ్యులు శ్రావ్య శృతి మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించుకోవచ్చాన్నారు. ప్రతి రోజు ఎంతో మంది అమ్మాయిలు, మహిళలు అక్రమ రవాణా ఉచ్చులో పడుతున్నారన్నారు.

February 22, 2026 / 06:31 PM IST

ధర్మారంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

PDPL: అనివార్య కారణాల వల్ల చదువు మధ్యలో మానేసిన వారికి ఆదివారం ధర్మారం కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఓపెన్ టెన్త్, ఇంటర్ బేస్ లైన్ పరీక్షలు నిర్వహించినట్లు కోఆర్డినేటర్ వడ్లూరి కిరణ్ తెలిపారు. చివరి పరీక్షలు ఏప్రిల్లో పెద్దపల్లిలో నిర్వహించబడతాయని ఆయన పేర్కొన్నారు. అందుకోసం విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

February 22, 2026 / 06:31 PM IST

శ్రీ వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగొద్దు: ఎంపీ

NDL: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంను రాజకీయాల్లోకి లాగడం తగదని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడారు. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తన అభ్యంతరకరమని, శ్రీవారిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం పాపమని విమర్శించారు.

February 22, 2026 / 06:31 PM IST