• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు’

SRCL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ పట్టణంలోని 14, 19వ వార్డులో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 08:41 AM IST

రాజమౌళి ‘వారణాసి’లో మరో స్టార్ హీరో?

దర్శకధీరుడు రాజమౌళి ‘వారణాసి’ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. రూ. 1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే, ఈ సినిమాలో కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

February 20, 2026 / 08:40 AM IST

సౌత్ జోన్ కు బయలుదేరిన పీయూ చెస్ జట్టు

MBNR: సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీ చెస్ ఉమెన్స్ టీం బయలుదేరింది. యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ క్రీడాకారులను అభినందించి ట్రాక్ షూట్ మరియు టీం యూనిఫామ్‌లను అందించి క్రీడల్లో మంచి ప్రదర్శన కనబరచాలని కోరారు. రిజిస్టర్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్ర పాల్గొన్నారు.

February 20, 2026 / 08:39 AM IST

‘చంద్రబాబు సర్కారు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’

W.G: చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాలు, అన్యాయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషిచేయాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు చేస్తానన్న మంచిని చేయకుండా వాటి నుంచి ప్రజలను దృష్టి మరల్చేందుకు ప్రశ్నించిన వారిపై కేసులు నమోదుచేస్తున్నారని విమర్శించారు.

February 20, 2026 / 08:38 AM IST

షదాబ్ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన అఫ్రిది

మాజీ క్రికెటర్లు జట్టుగా సాధించలేనివెన్నో తాము చేశామన్న పాక్ ప్లేయర్ షదాబ్ ఖాన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. దీనిపై షాహిద్ అఫ్రిదీ స్పందిస్తూ.. ‘షదాబ్ చెప్పినట్లే మేం టీమిండియాను ఓడించలేకపోయాం. కానీ ఆ విజయంతో పొందిన గౌరవాన్ని వాళ్లు కాపాడుకోలేకపోయారు. బాగా ఆడనప్పుడే మేం విమర్శిస్తాం. జట్టు నుంచి తొలగించినప్పుడు మేమే మద్దతుగా నిలిచామని గుర్తుపెట్టుకోవాలి’ అని అన్నాడు.

February 20, 2026 / 08:37 AM IST

శవాసనంతో బోలెడన్ని లాభాలు..​!

యోగాసనాల్లో శవాసనం చేయడం చాలా సులభం. ఇది చాలా మందికి ఇష్టమైన ఆసనం కూడా. దీనికి శవంలా పడుకుంటే చాలు. శవాసనం చేస్తున్నప్పుడు పడుకుని మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేయాలి. కళ్ళు మూసుకుని ఈ ఆసనం వేసేటప్పుడు మనస్సు శరీరంలోని ప్రతి భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వాలి. దీంతో రక్తపోటు తగ్గుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గి మనసుకు ప్రశాంతత కలుగుతుంది.

February 20, 2026 / 08:35 AM IST

తిరుమలలో పిల్లలు కిడ్నాప్.. మహిళ అరెస్ట్

అన్నమయ్య: కలకడకు చెందిన శివమ్మ(42) తిరుమలలో ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసింది. ప.గో జిల్లా తనుకుకు చెందిన కుటుంబం గురువారం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చింది. కాగా చిన్నారులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్లో తీసుకెళ్తుండగా కొవ్వూరు రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని, నిందితురాలిపై కేసు నమోదు చేసే అరెస్ట్ చేశారు.

February 20, 2026 / 08:35 AM IST

అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్: కలెక్టర్

సత్యసాయి: భారతీయ వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీ కోసం నిర్వహించే ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ కోరారు. గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మార్చి 9 ఎంపికలు జరుగుతాయన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

February 20, 2026 / 08:35 AM IST

వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా చెరుకుల జనార్ధన్ యాదవ్

తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం సర్పంచ్, వైసీపీ సీనియర్ నాయకుడు చెరుకుల జనార్ధన్ యాదవ్‌ను రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కేంద్ర కార్యాలయం నియమించింది. ఈ సందర్భంగా ఆయన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.

February 20, 2026 / 08:34 AM IST

‘ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అందుతున్నాయి’

BDK: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌ను ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకటరావు, గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు శుక్రవారం పాల్వంచలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలోని పలు సమస్యలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందుతున్నట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 08:33 AM IST

రాయల గండికి ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

NGKL: అమ్రాబాద్ మండలంలోని నల్లమల అడవి ప్రాంతంలోని రాయల గండిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని క్రీ.శ 1536లో చింతగుండ రంగారావు నిర్మించారు. ఈ ప్రాంతానికి రంగా రయుని గండి అని పేరు పెట్టగా కాలక్రమేన అది “రాయలగండి” గా ప్రసిద్ధి చెందింది. ఈ చెన్నకేశవ స్వామి ఆలయంలో మాల దాసరి వర్గానికి చెందిన వారు పూజలు నిర్వహించడం విశేషం.

February 20, 2026 / 08:33 AM IST

పాఠశాలకు 60 బెంచీలు వితరణ

CTR: మందస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థి సంఘం డస్క్ బెంచీలను వితరణగా అందజేశారు. సుమారు రూ. 90 వేలు విలువగల 60 డస్క్ బెంచీలను పాఠశాలకు అందజేసి దాతృత్వాన్ని చాటారు. HM శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అసోసియేషన్ ఫౌండర్ ప్రొఫెసర్ మోహన్ ఆచారి నిధుల సమీకరణ జరిపి చేస్తున్న కృషి ఆదర్శప్రాయం అని కొనియాడారు.

February 20, 2026 / 08:33 AM IST

WHAT’S TODAY

✦ TG: ఢిల్లీ AI సమ్మిట్‌లో పాల్గొననున్న CM రేవంత్✦ నిజమాబాద్‌లో PCC చీఫ్ మహేష్ పర్యటన✦ AP: ఢిల్లీ పర్యటనకు CM చంద్రబాబు✦ ఏడో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు✦ T20 WC: ఆస్ట్రేలియా, ఒమన్ మధ్య చివరి గ్రూప్ మ్యాచ్✦ ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్: IND vs SL సెమీస్

February 20, 2026 / 08:33 AM IST

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం : మంత్రి

SRPT: మేళ్లచెరువు మండలంలో జాతర సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా ముగిసింది. ఫైనల్ పోరులో విజయనగరం, వైజాగ్ జట్లు తలపడగా, విజయనగరం జట్టు విజేతగా నిలిచి లక్ష రూపాయల నగదు బహుమతిని కైవసం చేసుకుంది. విజేతకు ట్రోఫీని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.

February 20, 2026 / 08:32 AM IST

గన్నవరంలో నేటి కూరగాయల ధరలు ఇవే.!

కృష్ణా: గన్నవరం రైతు బజారులో శుక్రవారం కూరగాయల ధరలు కేజీల్లో ఇలా ఉన్నాయి. టమాట రూ.15, వంగ రూ.20-రూ.22, బెండ రూ.24, కాకర కేజీ రూ.32, బీరకాయ రూ.26-28, కాలీఫ్లవర్ ఒక్కటి రూ.15-20, క్యాబేజీ రూ.15గా నమోదయ్యాయి. క్యారెట్ రూ.31, దొండకాయ రూ.38, బంగాళాదుంప రూ.22, ఉల్లిపాయలు రూ.23, గోరు చిక్కుళ్లు రూ.28గా ఉన్నాయి. ఫ్రెంచ్‌బీన్స్ రూ.75, క్యాప్సికం రూ.67గా ఉన్నాయి.

February 20, 2026 / 08:32 AM IST