• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంఈవో ప్రసాద్

SKLM: ధర్మవరం మండలం వెంకటాపురం గ్రామంలో జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి  ప్రసాద్ రావు పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆహారం అందుతుందా లేదా అనే విషయంపై విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు వచ్చిన తెలియజేయాలని కోరారు.

February 20, 2026 / 12:42 PM IST

నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబ్ బెదిరింపు

HYD: నగరంలోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్‌తో కలిసి కోర్టు ప్రాంగణాన్ని పరిశీలిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఇలాంటి బెదిరింపు మెయిల్ వచ్చిన నేపథ్యంలో మళ్లీ అదే తరహా సందేశం రావడం ఆందోళన కలిగిస్తోంది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

February 20, 2026 / 12:42 PM IST

ప్రైవేట్ టీచర్లకు ఇండ్లు కేటాయించండి..!

SRPT: తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జునకు వినతి పత్రం అందజేశారు. ఫణిగిరి రామస్వామి గట్టు వద్ద నిర్మించిన సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను, అర్హులైన ప్రైవేట్ ఉపాధ్యాయులకు కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు మున్సిపల్ వైస్ చైర్మన్‌ను కోరారు. అనంతరం ఆయనను ప్రైవేట్ ఉపాధ్యాయులు సన్మానించారు.

February 20, 2026 / 12:42 PM IST

HYDలో పేరుకే ఉచిత పార్కింగ్!

HYD: జీవో నం. 15 ప్రకారం మాల్స్ లేదా మల్టీప్లెక్స్‌లో మొదటి 30 నిమిషాలు పార్కింగ్ పూర్తిగా ఉచితం. ఒకవేళ అక్కడ షాపింగ్ చేస్తే గంట వరకు ఉచితంగా ఉండాలి. కానీ, మాదాపూర్, గచ్చిబౌలి పరిధిలోని కొన్ని ప్రధాన మాల్స్ ‘డిజిటల్ ఎంట్రీ’ పేరుతో వాహనం లోపలికి వెళ్లకముందే సమయాన్ని లెక్కిస్తున్నాయి. లోపల సమయం వృథా అయ్యేలా చేసి రూ. 50 నుంచి రూ. 100 వసూలు చేయడం గమనార్హం.

February 20, 2026 / 12:40 PM IST

జమ్ములమ్మను దర్శించుకున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్

GDWL: నడిగడ్డ భక్తుల ఆరాధ్యదైవం, జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయాన్ని గద్వాల నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు శుక్రవారం సందర్శించారు. ఆలయ ఈవో పురందర కుమార్, అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు వారికి శ్వేత వస్త్రాలు సమర్పించారు.

February 20, 2026 / 12:39 PM IST

64మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు

ASR: పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం పీహెచ్‌సీ డాక్టర్ హేమంత్ చౌదరి సిబ్బందికి సూచించారు. శుక్రవారం పలకజీడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. 64మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స అందించామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్, ఈవో గంగరాజు, ఎల్టీ ఆనంద్ పాల్గొన్నారు.

February 20, 2026 / 12:39 PM IST

పెదపరిమిలో నూతన రామాలయం దర్శించిన ఎమ్మెల్యేలు

GNTR: పెదపరిమిలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని శుక్రవారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి కృషి చేసిన దాతలను అభినందించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడం సంతోషకరమని పేర్కొన్నారు.

February 20, 2026 / 12:39 PM IST

మిస్టిక్‌ థ్రిల్లర్‌ కథతో కళ్యాణ్ రామ్..!

ఓ విభిన్నమైన మిస్టిక్ థ్రిల్లర్‌ కథతో నందమూరి కళ్యాణ్ రామ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ రచయిత శ్రీకాంత్ విస్సా ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడట. ఇప్పటికే కథా చర్చలు పూర్తి కాగా.. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు టాక్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీని త్వరలోనే పట్టాలెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

February 20, 2026 / 12:39 PM IST

నూతన సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్

KDP: ఖాజీపేట(M) ముత్తలూరుపాడు, మూలవారిపల్లె గ్రామాల్లో దాదాపు రూ. 20 లక్షలతో నూతనంగా సిమెంటు రోడ్డు పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ పనులను గ్రామ సర్పంచ్ కొంగని వెంకటసుబ్బయ్య ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ..గ్రామంలో ప్రతి వీధికి సిమెంటు రోడ్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామయ్య వార్డు మెంబర్ సునీత పాల్గొన్నారు.

February 20, 2026 / 12:36 PM IST

గన్నవరంలో జగన్‌ను కలిసిన హాస్య నటుడు బ్రహ్మానందం

కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఆత్మీయంగా పలకరించారు. శుక్రవారం విమానాశ్రయానికి వచ్చిన సందర్భంగా ఇద్దరూ కాసేపు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. ఈ అనూహ్య భేటీ అక్కడున్న ప్రయాణికులు, అభిమానుల్లో ఆసక్తిని కలిగించింది.

February 20, 2026 / 12:35 PM IST

నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

HYD: నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ కరుణశ్రీ తెలిపారు. దిల్‌సుఖ్ నగర్‌లోని హైదరాబాద్-2 డిపో నుంచి రాకపోకలు సాగించే బస్సులకు సంబంధించి ప్రయాణికుల నుంచి సలహాలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు నేడు సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు 9959226249 నంబర్‌కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.

February 20, 2026 / 12:35 PM IST

పాక్ మాటలు నమ్మి మోసపోయాం: బంగ్లా

పాక్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ మాటలు నమ్మడం వల్లే T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిందని BCB జనరల్ సెక్రటరీ సయ్యద్ అష్రాఫుల్ హక్ సంచలన ఆరోపణలు చేశారు. తమ బోర్డ్ చీఫ్ అమీనుల్ ఇస్లామ్‌ను నఖ్వీ రెచ్చగొట్టారని.. ఆయన మాటలు విని ఎవరు మాత్రం గెలిచారని ఆవేదన వ్యక్తంచేశారు. కాగా భారత్ తమ ప్లేయర్లకు సేఫ్ కాదంటూ బంగ్లా టోర్నీ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.

February 20, 2026 / 12:34 PM IST

అతి పెద్ద మొత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

E.G: కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామానికి చెందిన మహమ్మద్ జరీనాకు రూ. 1,55,000 విలువ గల సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కును రాజానగరం నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ బత్తుల, వెంకటలక్ష్మి శుక్రవారం అందజేశారు. ఎమ్మెల్యే బత్తులు బలరామకృష్ణ సిఫార్సు మేరకు ఈ చెక్కు అందించడం జరిగింది అన్నారు.

February 20, 2026 / 12:34 PM IST

‘ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సంస్థకే కేటాయించాలి’

ప్రకాశం: ఆర్టీసీ గ్యారేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనిగిరి ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద ఆర్టీసీ కార్మికులు ఎస్డబ్ల్యుఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సమస్త కేటాయించాలని, గ్యారేజీలను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 12:32 PM IST

ఆకివీడు నుంచి అసెంబ్లీ సందర్శనకు విద్యార్థులు

W.G: ఆకివీడులోని విద్యార్థులు అసెంబ్లీ సందర్శించేందుకు శుక్రవారం బయలుదేరి వెళ్లారు. స్థానిక జడ్పీ హైస్కూల్‌కు, సరోజినీ నాయుడు బాలిక ఉన్నత పాఠశాలకు చెందిన 43 మంది విద్యార్థులు, ఏడుగురు ఉపాధ్యాయులు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. స్థానిక హై స్కూల్ వద్ద బస్సులో విద్యార్థులు ఎక్కించి కూటమి నాయకులు జండా ఊపి ప్రారంభించారు.

February 20, 2026 / 12:32 PM IST