నిర్మల్ జిల్లాలో నూతనంగా సదరం సర్టిఫికెట్లు పొందిన దివ్యాంగులకు త్వరలో పెన్షన్లు మంజూరు కానున్నాయని స్పందన దివ్యాంగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ తెలిపారు. అర్హులైన వారు అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలోని కొత్త దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
AKP: మండల కేంద్రమైన పరవాడలో ఆదివారం పైడిమాంబ అమ్మవారి పండగను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే తానాం గ్రామంలో పరదేశిమాంబ అమ్మవారి పండగను ఘనంగా నిర్వహించనున్నారు. రెండు గ్రామాల్లోనూ మూడు రోజులు పాటు పండగలు జరుగుతాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పండగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
BHNG: అడ్డగూడూరు మండల పరిధిలోని డి.రేపాక గ్రామ శివారులోని మూసీ నది నుంచి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. గ్రామానికి చెందిన లోడంగి శ్రీకాంత్ (29), ముక్కముల మల్లేష్ (25), కన్నా స్వామి (30) నుంచి మూడు ట్రాక్టర్లను అడ్డగూడూరు ఎస్సై వెంకట్ రెడ్డి స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
MDK: పెద్ద శంకరం పేట మండలం కమలాపూర్ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో పశువుల కాపరి మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపుర్‌కు చెందిన చాకలి బుచ్చయ్య గ్రామ శివారులో శనివారం పశువుల కాయడానికి వెళ్లి అనుమాదాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TPT: దేవస్థానం ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణశాలలో పనిచేస్తున్న అగర్బత్తులు తయారీ కేంద్రాన్ని జీఈఈవో డాక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. ప్రస్తుతం చామంతి, గులాబీ, తామర సుగంధాలతో మూడు రకాల అగర్బత్తులు తయారవుతున్నాయని, త్వరలో సంపంగి, వెయ్యి వరహాలు, తులసి సుగంధాలతో మరో మూడు రకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
GNTR: గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో సుమారు 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తిని ఒక గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
TG: అడవుల పరిరక్షణ కోసం 2026-27లో రూ.367.59 కోట్లతో రూపొందించిన ప్రణాళికకు అటవీశాఖ ఆమోదం తెలిపింది. 2026-27 వార్షిక ప్రణాళికపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డాక్టర్ సువర్ణ, ఇతర అధికారులు సమగ్రంగా చర్చించారు. అటవీ రక్షణ, నేల-తేమ సంరక్షణ పనులు, వన్య ప్రాణుల ఆవాసాల అభివృద్ధి, టైగర్ రిజర్వ్ కోర్ ప్రాంతాల నుంచి గ్రామాల తరలింపు, పునరావాసం వంటివాటికి ఈ నిధులను వినియోగించనున్నారు.
KMR: జిల్లా DMHO(I/C)గా డా. రవీందర్ గౌడ్‌ను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డా. రవీందర్ నాయక్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. డా. రవీందర్ గౌడ్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి KMRలో RMOగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2 రోజుల క్రితం డా. దుర్గా రామ్ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, మళ్ళీ మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు DPH&F తెలిపారు.
JN: జిల్లాలో ట్రాన్స్‌జెండర్ల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లకు ఒక్కొక్కరికి రూ.75 వేల చొప్పున మొత్తం రూ.2.25 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ నిధులు పునరావాస పథకం కింద 100 శాతం సబ్సిడీతో అందించినట్లు పేర్కొన్నారు
BHPL: జిల్లాలో పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం కింద ఉపకార వేతనాలు మంజూరు కావాలంటే విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ సీడింగ్ తప్పనిసరని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఇందిర తెలిపారు. BC, EBC విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నా, బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ చేయకపోతే స్కాలర్‌షిప్ జమ కాదని స్పష్టం చేశారు. ఆధార్ సీడింగ్ త్వరగా చేసుకోవాలన్నారు.
GDWL: జిల్లాకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ ఆదివారం రానున్నట్లు కార్యకర్తలు తెలిపారు. ఉదయం 11 గంటలకు అలంపూర్ చౌరస్తాలో నిర్వహించే సీపీఎం జిల్లా విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్.శ్రీరామ్ నాయక్ కూడా హాజరవుతారని జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి పేర్కొన్నారు.
VZM: పట్టణంలో స్దానిక కోట వద్ద ఆదివారం ఉదయం 6.30 నుండి 8.30 వరకు హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మునిసిపల్ సహాయ కమీషనర్ కిల్లాన అప్పలరాజు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యాంత్రిక జీవితంతో సతమతమవుతున్న ప్రజానీకానికి మానసిక ఉల్లాసం కలిగించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన దేవాదుల ప్రాజెక్ట్‌ను సందర్శించి, పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం, మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
HNK: భీమదేవరపల్లి మండల ప్రజల కోసం స్థానిక మోడల్ స్కూల్‌లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శనివారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రోగుల నమోదు ప్రక్రియ, ప్రాథమిక పరీక్షల కౌంటర్లు, జనరల్ ఫిజీషియన్ విభాగం, ఎముకల శస్త్ర చికిత్స విభాగాల్లో నిర్వహిస్తున్న పరీక్షలను పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు డాక్టర్లను కోరారు.
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో సీఎం కప్ 2025-26 రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, పూర్తి ఆత్మవిశ్వాసంతో క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం అర్చరీ విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు.