NLG: దేవరకొండలోని తెలంగాణ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో VTG-CET 2026, గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికి ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.హరిప్రియ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఆధార్, తదితర ఐడీ కార్డులతో కళాశాలకు ఉదయం 9 గంటల వరకు చేరుకోవాలని సూచించారు.
MNCL: జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు అధికారులు పరీక్షను నిర్వహించారు. పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ శనివారం కొనసాగింది. పంచాయతీరాజ్ చట్టం, పంచాయతీ విధులు, నిధులు, బాధ్యతలు, తదితర అంశాలపై వారికి శిక్షణ ఇచ్చి పరీక్షను నిర్వహించారు.
MDK: BRS పార్టీ రెండేళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తుందని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ, BRS నాయకులపై అక్రమ కేసులు బనాయించిన పోలీసులను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించబోమని హెచ్చరించారు. ఈసారి KCR కాళ్లు మొక్కైనా సరే అతిగా ప్రవర్తించిన అధికారులను వదిలేది లేదని స్పష్టం చేశారు.
KMR: విద్యార్థులు తప్పనిసరిగా సెల్ ఫోన్‌లకు దూరంగా ఉండాలని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. కామారెడ్డిలోని ZPHS పాఠశాలలో నేడు విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు మొబైల్ యొక్క స్క్రీన్ ప్రభావం వల్ల చూపు మందగించడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని సూచించారు.
KMM: పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేస్తూ విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని డీఐఈవో రవి బాబు ఆకాంక్షించారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని ఇవాళ తెలిపారు. హాల్‌టికెట్లలో ఏవైనా తప్పులుంటే వెంటనే కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
MBNR: జడ్చర్లలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయంలో ఉర్దూ భాషలో బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై ముస్లిం మైనార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఉర్దూ మాట్లాడే వారు అధికంగా ఉన్నందున రెండో అధికార భాషను విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ వెంటనే ఉర్దూ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
KNR: యూఏఈలోని అబుదాబిలో ఓపెన్ మాస్టర్ గేమ్స్ విలువిద్య (ఆర్చరీ) పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఆర్టీసీ KNR జోనల్ వర్క్ షాప్‌లో మెకానిక్‌గా పనిచేస్తున్న కూన కిషన్ పాల్గొని సత్తా చాటాడు. ఆర్చరీ విభాగంలో 40-50 వయస్సులో 50 మీటర్ల టార్గెట్‌లో కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా కూన కిషన్‌ను ఆర్టీసీ వీసీ ఎండి వై.నాగిరెడ్డి బస్ భవన్‌లో శాలువా కప్పి అభినందించారు.
ADB: సోనాల మండలంలోని దేవల్ నాయక్ తాండకు చెందిన గ్రామ పెద్దలు నెరడిగొండలోని MLA నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, పలు మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యేను గ్రామస్తులు కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
HYD: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఐకానిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. మూడేళ్ల పాటు ఈ భవనాన్ని అద్దాల మేడలా మెరిపించేందుకు రూ. 8.35 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో భాగంగా 24/7 టెక్ సపోర్ట్, మెకనైజ్డ్ క్లీనింగ్, గ్లాస్ ఫెసాడ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నారు. ఈ టవర్ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా అధికారులు రూపొందించారు.
SRCL: వేములవాడ మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా పుల్కం రాజు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు కౌన్సిల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఛైర్మన్ ప్రమాణస్వీకారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజు అభిమానులు తెలిపారు.
ప్రకాశం: కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలో వేంచేసియున్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి పల్లకి సేవా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు చోడా వీరభద్రస్వామి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులుకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
PLD: నరసరావుపేట నియోజకవర్గ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజల నుండి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి నమ్మకాన్ని నిలబెట్టడమే తన కర్తవ్యమని స్పష్టం చేశారు.
MDK: నిజాంపేట మండల పరిధిలోని షాకత్‌పల్లిలో శనివారం మంచినీటి పైప్‌లైన్ పనులను సర్పంచ్ సునీతబాబు ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామస్థులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు.
GNTR: తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో శనివారం నిర్వహించిన “స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల్లో శుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు. మండల పరిషత్ ఉర్దూ పాఠశాల, ఆంగన్‌వాడి కేంద్రాలను సందర్శించిన ఆయన చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.
శాసనమండలిలో నిన్న వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారని, మండలిలో చర్చలు జరగకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాడు జగన్ హయాంలో ప్రతి అంశంలో దోచుకున్నారని, తిరుమల లడ్డూను కూడా కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు.