• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బడంపేట జాతరకు స్పెషల్ బస్సు సౌకర్యం

SRD: జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి కోహిర్ మండలం బడంపేట రాచన్న స్వామి జాతరకు స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం భక్తుల ప్రయాణ సౌకర్యార్థం బస్సును ప్రారంభించారు. ఈ స్పెషల్ బస్సును ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ప్రయాణికుల రద్దీ అనుసరించి రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు.

February 22, 2026 / 09:18 AM IST

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రతిష్టాపన మహోత్సవం

KNR: మానకొండూర్ మండలం రంగంపేటలో శ్రీ మేడలంబ కేతకాంబ సమేత మల్లికార్జున స్వామి నూతన దేవాలయం ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 09:16 AM IST

రైతులు ఆదాయ మార్గాన్ని పెంపొందించుకోవాలి: కలెక్టర్

NTR: ఏ.కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో ఎన్టీఆర్ ఆర్గానిక్ రైతోత్సవం కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ఈ రైతోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రతి రైతు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రతి గ్రామ క్లస్టర్‌ను ఎంచుకొని, ఆదాయ మార్గాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

February 22, 2026 / 09:16 AM IST

ఉద్యోగం రాక యువకుడి బలవన్మరణం

MNCL: ఉద్యోగం రావట్లేదని మనస్థాపం చెంది ఓ నిరుద్యోగి ఈ నెల 19న ఘటన చెన్నూర్‌లో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోటబొగూడకి చెందిన కిరణ్ డిగ్రీ పూర్తి చేసి HYDలో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్-2, 3, 4 పరీక్షలు రాసినా ఆశించిన ఫలితం రాలేదు. దీంతో తన తల్లికి భారం కాకూడదని వేదన చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు.

February 22, 2026 / 09:15 AM IST

‘ఆర్గానిక్ పంటలను సందర్శించండి’

BDK: మణుగూరు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆర్గానిక్ పంటల సాగు ద్వారా గుర్తింపు పొందిన ఆదర్శ రైతులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్గానిక్ పంటల సాగు పండించే విధానం, పంటల దిగుబడి తద్వారా పొందే మెరుగైన ఫలితాలు, వాటి ఉపయోగాలు వంటి విషయాలపై ఆదర్శ రైతు లైన యారం లక్ష్మీరెడ్డి, మేడిపల్లి ఉదయ్‌తో కలిసి వివరించారు.

February 22, 2026 / 09:15 AM IST

ఈ నెల 28న జిల్లాకు సీఎం చంద్రబాబు

VZM: ఈ నెల 28న సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నారు. చీపురుపల్లి మండలం రావివలసలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని అధికారికంగా సమాచారం అందినట్లు ఎమ్మెల్యే కళా వెంకట్రావు తెలిపారు. అనంతరం అదే రోజున పార్టీ శ్రేణులతో సమావేశం అవుతారన్నారు.

February 22, 2026 / 09:15 AM IST

రాష్ట్రస్థాయి పోటీల్లో కమాన్‌పూర్ విద్యార్థినికి బంగారు పతకం

PDPL: రాష్ట్రస్థాయి పోటీల్లో కమాన్‌పూర్ విద్యార్థిని బంగారు పతకం సాధించింది. హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలో కమాన్‌పూర్ మండలానికి చెందిన నల్లవెల్లి ఆనంది 18 ఏళ్ల విభాగం 400 మీటర్ల పరుగులో బంగారు పతకం సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమెను పలువురు అభినందించారు.

February 22, 2026 / 09:13 AM IST

ఈనెల 23న కేంద్ర బృందం పర్యటన.. కలెక్టర్ సూచనలు

జనగామ జిల్లా ఐదు పైలట్ జిల్లాల్లో ఒకటిగా ఎంపిక కావడం సంతోషకరమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. RPRP కింద అమలవుతున్న 46 కేంద్ర ప్రభుత్వ పథకాల సమగ్ర తనిఖీ కోసం ఈ నెల 23న కేంద్ర బృందం జిల్లా పర్యటన జరగనుంది. కలెక్టర్ అధికారులు అన్ని కేంద్ర పథకాల అమలు వివరాలు, లబ్ధిదారుల సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు.

February 22, 2026 / 09:12 AM IST

ప్రొద్దుటూరు వెటర్నరీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మిస్సింగ్

KDP: ప్రొద్దుటూరు వెటర్నరీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సాయి ఊర్మిళ మిస్సింగ్ అయ్యారు. ఈ మేరకు ఆమె భర్త సూర్యకృష్ణ స్థానిక 2-టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2-టౌన్ SI రాఘవేంద్రారెడ్డి ఆదివారం మీడియాకు ఇచ్చిన సమాచారం మేరకు.. సాయి ఊర్మిళ, సూర్య కృష్ణ దంపతులు స్థానిక గోపవరం పంచాయితీలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్నారు.

February 22, 2026 / 09:12 AM IST

మార్చి 14 నుంచి SSC పరీక్షలు

KNR: మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి లేకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని, తాగునీరు, విద్యుత్, బెంచీలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

February 22, 2026 / 09:11 AM IST

నేడు ఓలాకు గోషామహల్ ఎమ్మెల్యే రాక

NRML: కుంటాల మండలం ఓలా గ్రామంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు విగ్రహ కమిటీ సభ్యులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కావున హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

February 22, 2026 / 09:10 AM IST

నేటితో ముగియనున్న ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు

MBNR: జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్లో 5 నెలల ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనున్నట్లు డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రూప్ 1, 2, 3, 4తో పాటు ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నట్లు ఆయన వెల్లిడించారు.

February 22, 2026 / 09:10 AM IST

ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్: SP

E.G: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల కోసం అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని SP నరసింహ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆదివారం తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి చేరుకోవాలని, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు.

February 22, 2026 / 09:10 AM IST

ఆదోని సుందరయ్య భవన్ సీపీఎం కార్యాలయం నిర్మాణానికి విరాళం

KRNL: ఆదోనిలో సుందరయ్య భవన్ సీపీఎం కార్యాలయం నిర్మాణానికి డీవైఎఫ్ఐ పట్టణ నాయకులు సతీష్ గారి తల్లి గ్రేసమ్మ ఆదివారం రూ.10,111 విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని పార్టీ నాయకులకు ఆమె స్వయంగా అందజేశారు. కార్యాలయ నిర్మాణానికి సహకరించినందుకు సీపీఎం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఇటువంటి సహకారం మరింత ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.

February 22, 2026 / 09:09 AM IST

జిల్లాలో నేటి చికెన్ ధరలు ఎంతంటే..

KMM: ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 206 నుంచి రూ. 230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 234 నుంచి రూ. 260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గింది. దీంతో చికెన్ షాప్ దగ్గర వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి.

February 22, 2026 / 09:08 AM IST