• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు ఏర్పాటు: అదనపు కలెక్టర్

KMM: జిల్లాలో పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 10 వరకు జరిగే ఈ పరీక్షలకు 16,975 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విద్యాశాఖను ఆదేశించారు.

February 24, 2026 / 07:13 AM IST

ఇంటర్ పరీక్షకు 39 మంది గైర్హాజరు

ELR: బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 152 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 113 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అలాగే 39 మంది పరీక్షకు హాజరు కాలేదని అధికారులు పేర్కొన్నారు.

February 24, 2026 / 07:10 AM IST

వాట్సాప్ సేవలపై అవగాహన పెంచాలి: కలెక్టర్

అన్నమయ్య: మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నిశాంత్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వాట్సాప్ ద్వారా అందించే సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, భూసేకరణ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు.

February 24, 2026 / 07:09 AM IST

నగరంలో భారీ వర్షం.. మరి కొన్ని గంటల్లో..

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి అల్వాల్, జూబ్లీహిల్స్, బషీర్ బాగ్‌తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే కొన్ని గంటల్లో నగరమంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని మ్యాప్ విడుదల చేసింది.

February 24, 2026 / 07:06 AM IST

‘పత్తిపాకలో ప్లాస్టిక్ వాడకం నిషేధం’

PDPL: ధర్మారం మండలం పత్తిపాకలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానించింది. ప్లాస్టిక్ కవర్లు వినియోగించిన, బహిరంగ ప్రదేశాలలో పడవేసిన వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం నిరోధించి భావితరాలకు ప్రాణాధారం కల్పించాలని గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

February 24, 2026 / 07:05 AM IST

‘గోదావరి పుష్కర ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

NZB: 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గత పుష్కరాల్లో గోదావరిలో పుష్కర స్నానం చేసిన భక్తుల సంఖ్య, భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, ఏర్పాట్లు చూడాలన్నారు.

February 24, 2026 / 07:05 AM IST

ఆన్‌లైన్ హాల్ టికెట్‌ ఉన్నా పరీక్షకు అనుమతి

KNR: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,426 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 57 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఆన్‌లైన్‌ హాల్ టికెట్‌తోనే పరీక్షలకు హాజరుకావచ్చని RIEO గంగాధర్ స్పష్టం చేశారు.

February 24, 2026 / 07:04 AM IST

పైప్ లైన్ మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎంపీడీవో

కృష్ణా: గుడ్లవల్లేరు మండల PHC వద్ద జరుగుతున్న మంచినీటి పైప్ లైన్ మరమ్మత్తు పనులను ఎంపీడీవో ఇమ్రాన్ మంగళవారం పరిశీలించారు. PHC ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా మరమ్మత్తు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి ఎంపీడీవో ఆదేశించారు. ఆస్పత్రి ప్రాంతంలో రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

February 24, 2026 / 07:04 AM IST

సైబర్ క్రైమ్ నేరాల అదుపునకు ప్రత్యేక దృష్టి: SP

ADB: సైబర్ క్రైమ్ పై ఉక్కు పాదం మోపుతూ, నేరాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం మరో అడుగు ముందుకు వేసిందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలకు పరోక్షంగా సహకరిస్తూ మోసాలు చేస్తున్న నిందితులు ఇర్ఫాన్, సాహిల్, అనాస్ ను అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు. నిందితులపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

February 24, 2026 / 07:02 AM IST

నేడు కుమ్మెరకు బీసీ కమిషన్ ఛైర్మన్ రాక

NGKL: కుమ్మెరలో జరిగిన చిన్నారి మౌనిక మృతి ఘటనపై విచారణకు తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ మంగళవారం రానున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు గ్రామానికి చేరుకుని, ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించడంతో పాటు బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ అధికారుల నుంచి కమిషన్ నివేదిక కోరింది.

February 24, 2026 / 07:02 AM IST

రూ.4వేల కోట్ల పనులకు మంత్రి వర్గం ఆమోదం

TG: హైదరాబాద్‌ నగరానికి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. రహదారుల అభివృద్ధి, తాగునీటికి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదించింది. రూ.4 వేల కోట్లకుపైగా నిధులతో వీటిని చేపట్టనున్నారు. HMDAలో మరో నాలుగు గ్రామాలను చేర్చేందుకు.. నియోపొలిస్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి భూమి కేటాయింపునకు.. అత్యాధునిక జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

February 24, 2026 / 07:02 AM IST

కూర్మాసనం వల్ల కలిగే ఉపయోగాలు

కూర్మాసనం(తాబేలు భంగిమ) వెన్నెముకను బలోపేతం చేస్తూ వెన్నునొప్పిని తగ్గిస్తుంది. వెన్నెముకను సాగదీయడం ద్వారా ఇది వీపు, భుజాలు, తుంటి కండరాలను బలోపేతం చేస్తుంది. ఈ ఆసనం ఉదర భాగంపై ఒత్తిడి తెచ్చి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. మెదడుకు, శరీరంలోని ఇతర అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమిని తగ్గించి విశ్రాంతి ఇస్తుంది.

February 24, 2026 / 07:02 AM IST

రాష్ట్ర స్థాయిలో మెరిసిన దివ్యాంగ విద్యార్థులు

KMR: జిల్లా దివ్యాంగ విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.HYD దోమలగూడలో ఈనెల 17న నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి 30 మంది పాల్గొన్నారు.12 మంది ట్రోఫీలు, బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు సాధించారు. అథ్లెటిక్స్, షాట్‌పుట్, లాంగ్ జంప్, రన్నింగ్ ఈవెంట్స్‌లో తమ సామర్థ్యాన్ని చాటారు. విజేతలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సత్కరించారు.

February 24, 2026 / 07:01 AM IST

పారిశుద్ధ్య లోపంపై కమిషనర్ హెచ్చరిక

వరంగల్ నగరంలో చెత్త వేసే ప్రాంతాలను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ హెచ్చరించారు. సోమవారం గ్రేటర్ వరంగల్‌లోని కాకతీయ కాలనీ, కేయూసీ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త క్లియర్ చేయని ఇద్దరు జవాన్లకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా విధించాలని అధికారులకు ఆదేశించారు.

February 24, 2026 / 07:00 AM IST

మామిడి వేలంకు స్థలం కేటాయించాలని వినతి

W.G: మొగల్తూరులో ప్రసిద్ధి గాంచిన మామిడి ఫలసాయాన్ని వేలం వేసుకునేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మామిడి రైతులు, వర్తకులు సోమవారం అధికారులకు విన్నవించారు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎంపీడీవో త్రిశూల పాణి, తహసీల్దార్ రాజ్ కిషోర్‌కు వినతిపత్రం అందజేశారు. మామిడి విక్రయాల కోసం వేలం కేంద్రం ఏర్పాటు చేయాలని వారు కోరారు.

February 24, 2026 / 07:00 AM IST