KMM: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ శ్రీశ్రీశ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆశ్రమ పీఠాధిపతి బసవత్తుల రాజమౌళీశ్వర స్వామి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను నేడు కలిసి శాలువాతో సత్కరించారు. పాండవుల గుట్ట వద్ద ఉన్న ఆశ్రమంలో మార్చి 13 నుంచి 15వ తేదీ వరకు జరిగే అష్టోత్తర శతకుండ సహిత శతరుద్ర మాయాగానికి రావాలని ఎంపీకు ఆహ్వాన పత్రిక అందజేశారు.
NRPT: గుండుమాల్ మండలం ముదిరెడ్డిపల్లిలో 4, 5వ వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ కాలువలు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సర్పంచ్ దేవమ్మ కృష్ణయ్య పనులను పరిశీలించి నాణ్యత పాటించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో, తిరుపతి రెడ్డి చొరవతో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.
NDL: బనగానపల్లె టౌన్ బస్టాండ్‌లో మంగళవారం ఒక వ్యక్తి మృతి చెందాడు. అతను మహానంది గ్రామానికి చెందినవాడని సమాచారం లభించింది. స్థానికులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరింత సమాచారం కోసం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WGL: నెక్కొండ మాజీ ఎంపీటీసీ ఈదునూరి కరిష్మాను మంగళవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరామర్శించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కుటుంబానికి కాంగ్రెస్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి: గత ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 300 దేవాలయాలపై దాడులు చేసి కూల్చివేశారని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం శాసనసభలో మాట్లాడారు.
ATP: గుత్తి ఐసీడీఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు సీఐటీయు నాయకులతో కలిసి మంగళవారం 2వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అంగన్వాడీ టీచర్లు కళ్యాణి మాట్లాడుతూ.. సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని, అంగన్వాడీ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, ప్రీస్కూల్ పిల్లలకు తల్లికి వందనం అమలు చేయాలన్నారు. కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలన్నారు.
MBMR: పాలమూరు యూనివర్సిటీ మహిళా క్రాస్ కంట్రీ జట్టు AIU యూనివర్సిటీ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి మంగళూరు యూనివర్సిటీకి బయలుదేరింది. ఈ పోటీలు ఫిబ్రవరి 26-28 వరకు జరుగనున్నాయి. ఉపకులపతి ప్రో జి.ఎన్. శ్రీనివాస్ క్రీడాకారిణులకు ట్రాక్ షూట్లు, యూనిఫామ్‌లు అందజేసి జాతీయ స్థాయిలో రాణించి యూనివర్సిటీకి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
NLR: వ్యవసాయం తర్వాత లక్షలాది రైతు కుటుంబాలకు స్థిరమైన రోజువారీ ఆదాయం అందించే పాడి రంగాన్ని బలోపేతం చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం శాసనసభ సమావేశాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, పాడి పరిశ్రమ రెండు కళ్ళుగా అభివర్ణించారు. పశు వైద్యశాలలు ఆధునికరించాలన్నారు.
విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో తమిళ కమెడియన్ యోగిబాబు భాగం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయనపై త్రివిక్రమ్ చాలా కామెడీ సన్నివేశాలను ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
GNTR: కల్తీ నెయ్యి వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మంగళవారం అసెంబ్లీలో ఆరోపించారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసాదంలో కల్తీ జరగడం యాదృచ్ఛికం కాదని, ఇది పక్కా ప్రణాళికతో చేసిన పని అని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమలలో జరిగిన అక్రమాలు బ్రిటిష్ పాలనకంటే దారుణంగా ఉన్నాయన్నారు.
KRNL: గోతులదొడ్డి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, సర్పంచ్ లక్కీ హనుమంతమ్మ భర్త టీడీపీ బీసీ సెల్ మండల ఉపాధ్యక్షులు లక్కే గోవింద్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 30 సంవత్సరాలుగా టీడీపీ పార్టీనే నమ్ముకుని పార్టీ కోసం కష్టపడితే పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరాలు అయినా గుర్తించకపోవడం చాలా బాధాకరమని వాపోతూ రాజినామా చేసినట్లు సమాచారం.
MDCL: ఫిబ్రవరి 24 వరకు యూరియా నిల్వల పై ఫెర్టిలైజర్ యాప్ తాజా సమాచారం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,71,041 యూరియా బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల వారీగా వికారాబాద్‌లో 10,991 బ్యాగులు, రంగారెడ్డిలో 16,809 బ్యాగులు, మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 8,263 బ్యాగులు నిల్వలో ఉన్నాయని అధికారులు తెలిపారు. రైతులు అవసరమైన మేరకు బుక్ చేసుకోవాలని సూచించారు.
AKP: నాతవరం మండలం లింగంపేట గ్రామంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని తమ సొంత భూమిగా చూపిస్తూ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటనలో కేసు నమోదు చేశామని సీఐ రేవతమ్మ తెలిపారు. కోటవురట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు రెవెన్యూ, పంచాయతీ అధికారుల విచారణలో వెల్లడైందన్నారు. ఆరుగురిని అరెస్టు చేశామన్నారు.
ఎన్టీఆర్: కంచికచర్ల మండల ప్రభుత్వ ఖాజీగా నియమితులైన షేక్ అబ్దుల్ రషీద్ మంగళవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. మైనారిటీ నాయకులు, కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన ఆయనకు ఆమె అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనారిటీ సోదర సోదరీమణుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేయాలన్నారు.
కృష్ణా: చల్లపల్లి కేడీసీసీ బ్యాంకు వద్ధ సహకార సంఘ ఉద్యోగుల సమ్మె మంగళవారం 9వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. సహకార సంఘాల ఉద్యోగులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా నాయకులు చండ్ర రవి కుమార్, తోట కృష్ణారావు, కోసూరు రామాంజనేయులు, నియోజకవర్గ పరిధిలోని 37 సొసైటీల సిబ్బంది పాల్గొన్నారు.